గూగుల్ పే తమ యూజర్లకు షాకిచ్చేవార్త తెలిపింది. వచ్చే ఏడాది జనవరి నుంచి గూగుల్ వెబ్ పే సేవలు నిలిపివేయనుంది. అదే విధంగా ఇప్పుడు గూగుల్ పే యూజర్లు తక్షణ నగదు బదిలీ చేస్తే కస్టమర్ల నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు. కాగా త్వరలో వీటికి కూడా చార్జీలు చెల్లించవలసి ఉంటుందని తెలిపింది.
‘2021 ప్రారంభంలో, మీరు ఇతర వ్యక్తుల నుండి డబ్బు పంపించడానికి, స్వీకరించడానికి pay.google.comను ఉపయోగించలేరు. కాబట్టి ఇక నుండి కొత్త గూగుల్ పే యాప్ ను ఉపయోగించండి’ అని సంస్థ పేర్కొంది.
గూగుల్ పే వెబ్ యాప్లో.. పీర్-టూ-పీర్ పేమెంట్ సదుపాయాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి అమెరికాలో నిలిపేసేందుకు సిద్ధమైంది. మొబైల్ యాప్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగనున్నాయి. అయితే ఇది ప్రస్తుతానికి అమెరికా ప్రజలకు మాత్రమేనని గూగుల్ పే ప్రకటించింది.