టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ మైనింగ్ అధికారుల నుండి ఊహించని షాక్ తగిలింది. త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో రూ. 100కోట్ల జరిమానా విధించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈమేరకు ఏపీ మైనింగ్ శాఖ నిర్ణయంతీసుకుంది. జరిమానా చెల్లించడంలో విఫలమైతే జేసీ కుటుంబానికి సంబందించిన ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించింది.
కాగా జేసీదివాకర్ రెడ్డికి సంబందించిన త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ అక్రమాలు జరిగినట్టు ఆర్అండ్ఆర్ అధికారులు గుర్తించారు. యాడికి మండలం, కొనుప్పలపాడులో ఇప్పటికే దాదాపు 14 మెట్రిక్ టన్నుల అక్రమ మైనింగ్ జరిగినట్టు తేల్చారు. ఈ క్రమంలో విలువైన లైం స్టోన్ ను తరలివెళ్లినట్టు గుర్తించారు.
మొదట తమ డ్రైవర్లు, పని వారితో జేసీ త్రిశూల్ సిమెంట్ అనుమతులు పొందారని ఆ తరువాత వారి నుంచి కుటుంబ సభ్యులకు వాటాలను బదలాయించారని అధికారులు గుర్తించారు. ఈ అక్రమ తవ్వకాల నేపథ్యంలో జేసీకి రూ. 100 కోట్ల జరిమానా విధిస్తూ ఆర్అండ్ఆర్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.