logo

  BREAKING NEWS

గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |   మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |  

చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ తగిలింది. క్రైస్తవులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతుంది. బాబు వ్యాఖలకు నిరసనగా సొంత పార్టీ నేతల నుంచే బాబుకు వ్యతిరేకత ఎదురైంది. చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా ఇటీవల మాజీ ఎమ్మెల్యే ఫిలిప్‌ సి తోచర్‌ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

అధికారంలో ఉన్న సమయంలో మెడలో శిలువ వేసుకుని తిరిగిన బాబు ఇప్పుడు క్రైస్తవులను అవమానిస్తున్నాడంటూ బాబు వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా టీడీపీ పార్టీకి 13 జిల్లాలకు చెందిన క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు మూకుమ్మడిగా రాజీనామా ప్రకటించారు. ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు క్రైస్తవ సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని నేతలు మండిపడుతున్నారు.

ఈ సందర్భంగా క్రిస్టియన్ సెల్ నేత ప్రవీణ్ మాట్లాడుతూ… క్రైస్తవులు బలవంతంగా మతమార్పిడులు చేస్తున్నారని బాబు అన్నారు. మతమార్పిడులు ఎక్కడ జరిగాయో నిరూపించాలని ఆయన సవాలు చేసారు. చంద్రబాబు వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధించాయన్నారు. చర్చి ఫాదర్ లకు రూ. 5 వేలు ఇస్తే తప్పుపట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఒకప్పుడు చర్చిలో కూర్చుని బాబు ప్రార్థనలు చేసారంటూ ఎద్దేవా చేశారు. బాబు క్రైస్తవులపై చేసిన వ్యాఖ్యలపై సంజాయిషీ ఇచ్చుకోవాలని ఆయన డిమాండ్ చేసారు.

Related News