logo

  BREAKING NEWS

అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |   వ్యాయామం ఏ వయసు వారు ఎంతసేవు చేయాలి: డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలు  |   బ్రేకింగ్: మంత్రి పేర్ని నానిపై హ‌త్యాయ‌త్నం  |   తెలంగాణలో కరోనా అప్ డేట్.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?  |   ‘సర్జికల్ స్ట్రయిక్స్’ అంటే ఏమిటి? ఎలాంటి సందర్భాలలో నిర్వహిస్తారు?  |   బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |  

రాహుల్ పై ఒబామా వ్యాఖ్యలు.. మండిపడుతున్న శివసేన!

తన రాజకీయ అనుభవాలు, జీవితంలో ఎదురైన విశేషాల ఆధారంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ‘ఎ ప్రామిస్డ్ లాండ్ ‘ అనే పుస్తకాన్ని రాశారు. అయితే ఈ పుస్తకంలో ఒబామా కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ పేరును ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. అంతే కాదు రాహుల్ పై ఒబామా కీలక వ్యాఖ్యలు చేసారు.

‘రాహుల్ గాంధీ లో ఎక్కడో తెలియని భయం ఉంది. అతను నాకు తరగతి గదిలో టీచర్ ను ఆకట్టుకోవడానికి ప్రయత్నించే విద్యార్థిలా కనిపించాడు. అతనిలో ఏదైనా ఒక విషయాన్నీ లోతుగా తెలుసుకోవాలనే పట్టుదల అభిరుచి లేదు అంటూ తన పుస్తకంలో రాసినట్టుగా న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. కాగా ఒబామా వ్యాఖ్యలపై ఇప్పుడు భారత రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీశాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఒబామా వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో శివసేన ఫైర్ బ్రాండ్ గా పేరున్న సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మన దేశ రాజకీయాలపట్ల ఆయనకు ఎలాంటి అవగాహన లేదన్నారు. ట్రంప్ పిచ్చివాడని మేము అనము. అలాగే మా దేశం గురించి ఆయనకు ఏం తెలుసు.

అధ్యక్షుడి హోదాలో ఒబామా ఎనిమిది పదేళ్ల క్రితం భారత్ కు వచ్చారు. ఆ సమయంలో రాహుల్ ను కలిశారు. ఆ కొద్ది పాటి పరిచయంతోనే ఓ నేతపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు. అప్పటితో పోలిస్తే ఆయన వ్యక్తిత్వంలో ఎంతో మార్పు వచ్చింది. ఓ పరిణితి చెందిన నేతగా ఎదిగారు. అంటూ మరో కాంగ్రెస్ నేత తారిఖ్ అన్వర్ ఒబామా వ్యాఖ్యలపై మండిపడ్డారు.

Related News