logo

  BREAKING NEWS

బ్రేకింగ్: మళ్ళీ రాజకీయాల్లోకి మెగాస్టార్.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు!  |   ఎర్రకోట అల్లర్లు: పంజాబీ నటుడు దీప్ సిద్ధూ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!  |   అంబానీ సెకను ఆదాయం.. సామాన్యుడికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా?  |   ప‌ద్మ‌విభూష‌ణ్‌, ప‌ద్మ‌భూష‌ణ్‌, ప‌ద్మ‌శ్రీ అవార్డుల‌తో ఎంత డ‌బ్బు ఇస్తారో తెలుసా ?  |   హింసాత్మకంగా మారిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ  |   ఏపీ పంచాయతీ వార్: జగన్ సర్కార్ ఆదేశాలకు ఎస్ఈసీ నో..!  |   తెలంగాణలో కొత్త పార్టీ.. క్లారిటీ ఇచ్చిన వైఎస్ షర్మిల!  |   సుప్రీం తీర్పు: అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం!  |   పంచాయతీ ఎన్నికలు.. ఉద్యోగ సంఘాలకు నిమ్మగడ్డ షాక్!  |   బ్రేకింగ్: ఎన్నికలపై సుప్రీం తీర్పు: నిమ్మగడ్డ సంచలన నిర్ణయం!  |  

హడలెత్తిస్తున్న కొత్త వ్యాధి.. ఈ జాగ్రత్తలు పాటించకుంటే ప్రాణాలకే ముప్పు!

2020 కొత్త రకం వ్యాధులను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఏడాది క్రితం చైనాలో కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత ఎన్నో కొత్త వ్యాధులు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఏలూరులో వింతవ్యాధి కలకలం రేపిన ఘటన మరువకముందే ఇప్పుడు మరో అంటు వ్యాధి భారత్ కు సవాలు విసురుతోంది. మనదేశంలో కొత్త వ్యాధులన్నీ ముందు కేరళ రాష్ట్రంలోనే మొదలవుతాయి. గతంలో నిఫా వైరస్, ఈ ఏడాది కరోనా కేసులను మొదట కేరళలోనే గుర్తించారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో మరో ప్రాణాంతక వ్యాధి ప్రబలుతోంది. కేరళ రాష్ట్రంలోని కోజిక్కోడ్ లో ఈ మహమ్మారి వెలుగుచూసింది. ‘షింగెల్లా’ పేరుతో కొత్త రకం బ్యాక్టీరియాను అక్కడి ఆరోగ్య శాఖ గుర్తించింది.

ఈ బ్యాక్టీరియా సోకి 11 ఏళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. అంతేకాదు అతనితో సన్నిహతంగా మెలిగిన వారు కూడా అస్వస్థతకు గురయ్యి వివిధ లక్షణాలతో ఆసుపత్రిలో చేరారని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఈ వ్యాధి సోకిన వారు మృత్యువాత పడుతుండటం, ఒకరి నుంచి మరొకరికి చాలా సులభంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆరోగ్య శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. ఇప్పటికే అక్కడ పదుల సంఖ్యలో ఈ కేసులు నమోదవుతున్నాయి. ప్రయాణికుల ద్వారా పొరుగు రాష్ట్రాలకు కూడా ఈ బ్యాక్టీరియా విస్తరించే అవకాశం ఉంది. దీంతో ఈ వ్యాధి పై ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు అధికారులు. ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ వ్యాధి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

షింగెల్లా బాక్టీరియ సోకిన వారు డయేరియా(విరేచనాలు), జ్వరం, కడుపునొప్పి, వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించగలదు. ఒక వ్యక్తిలో ఈ బ్యాక్టీరియా లక్షణాలు తగిపోయినా కూడా వారి ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. ముఖ్యంగా చెడిపోయిన ఆహారం, కలుషిత నీటి ద్వారా ఈ బ్యాక్టీరియా పుట్టుకొస్తుంది. జబ్బుపడిన వ్యక్తి తాకిన ప్రదేశాలు, వారు ఉపయోగించిన వస్తువులు, వారు తిన్న ఆహారం ఇలా ప్రతి ఒక్క చోట ఈ బ్యాక్టీరియా సోకె ప్రమాదం ఉంది. వ్యాధి సోకిన వారితో సెక్సువల్ కాంటాక్ట్ లో ఉంటె కూడా వారి నుంచి ఇది ఇతరులకు సోకుతుంది. ఒక్క సారి ఇది మన శరీరంలోకి వెళితే ప్రాణాంతకంగా మారుతుంది. ఈబ్యాక్టీరియాకు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వ్యాపించగలదు. ముఖ్యంగా చిన్న పిల్లలలో ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎక్కువగా కలుషిత నీరు తాగితే వారికీ కూడా ఈ ప్రమాదం పొంచి ఉంటుంది.

అయితే కేరళలో ఈ వ్యాధి బారిన పడిన వారిలో చిన్న పిల్లలే అధికంగా ఉన్నారు. 2019 లో ఒకసారి ఈ వ్యాధి కేరళలో కనిపించింది. కోయిలాండీ అనే ప్రాంతంలో మధ్యాహ్న భోజనం చేసిన 40 మంది విద్యార్థులు ఈ వ్యాధి బారిన పడిన అస్వస్థతకు గురయ్యారు. మళ్ళీ ఈ వ్యాధి విజృంభిస్తుండటం కలకలం రేపుతోంది. ఈ వ్యాధి కారణంగా అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం ప్రజలకు కొన్ని సూచనలు చేస్తుంది. కలుషిత నీరు ఆహారం వల్ల ఈ వ్యాధి సోకుతున్న నేపథ్యంలో ప్రతి ఇంట్లో కాచి వడపోసిన నీటినే తాగాలి. చేతులను శుభ్రంగా కడుక్కుని పరిశుభ్రత పాటించాలి. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయకూడదు.

నిల్వ ఉంచి ఆహారానికి దూరంగా ఉండాలి. పిల్లల డైపర్లను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. మూతలు లేని ఆహార పదార్థాలను తినకూడదు ఇంట్లోని టాయిలెట్లు, బాత్రూములను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. పండ్లు కూరగాయలను సరిగ్గా కడిగిన తర్వాతనే ఉపయోగించాలి. అపరిశుభ్రంగా ఆన్న ప్రాంతాలకు వెళ్ళకూడదు. వ్యాధి లక్షణాలు ఉన్న వారికి వీలైనంతదూరంగా ఉండాలి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. మలమూత్రాలను పరీక్షించడం ద్వారా ఈ వ్యాధిని గుర్తిస్తారు. ప్రస్తతం ఈ వ్యాధి బారిన పడిన వారికి యాంటీ బయోటిక్స్ ద్వారా చికిత్సను అందిస్తున్నారు.

Related News