logo

  BREAKING NEWS

ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు  |   బ్రేకింగ్‌: రైతుల కోసం జ‌గ‌న్ మ‌రో అద్భుత‌మైన ప‌థ‌కం  |   సోష‌ల్ మీడియాలో క‌నిపించే ఈ ఆఫ్రిక‌న్ బుడ్డోడి అస‌లు క‌థ ఇది  |   కరోనా రికార్డు.. 24 గంటల్లో 20,903 కేసులు.. 18 వేల మరణాలు!  |   లఢక్ కు చేరుకున్న ప్రధాని మోడీ.. దేనికి సంకేతం?  |   తెలంగాణలో లాక్ డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ..!  |  

ఆ యంగ్ హీరో కోసం.. తెలుగు తెరపై ‘సాగర కన్య’ రీఎంట్రీ..!

దాదాపు 20 ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ వస్తున్నారు అందాల తార శిల్పా శెట్టి. రాఘవేందర్ రావు దర్శకత్వంలో వెంకటేష్ సరసన శిల్పా శెట్టి నటించిన ‘సాహస వీరుడు సాగర కన్య’ సినిమా తెలుగులో ఆమెకి మంచి క్రేజ్ తెచ్చింది. ఆ తరువాత బాలీవుడ్ లో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టడంతో తెలుగు పరిశ్రమకు దూరమయ్యారు.

తెలుగులో ఆమె బాలకృష్ణ సరసన ‘భలే వాడివి బాసు'(2001) అనే సినిమాలో చివరగా కనిపించారు. ఆ తరువాత డేట్స్ అడ్జస్ట్ చేయలేని కాణంగా కొన్ని అవకాశాలను కూడా వదులుకున్నారు. తాజా సమాచారం ప్రకారం శిల్పా శెట్టిని తెలుగు తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారట తెలుగు దర్శకులు. హిందీలో సూపర్ హిట్ అయిన ‘అందునాధన్’ సినిమాను తెలుగులో నితిన్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం శిల్పా శెట్టిని సంప్రదించారట. ఆమె సినిమాలో నటిస్తే సినిమాకు భారీ హైప్ వస్తుందని సినిమా యూనిట్ భావిస్తున్నారు. ముందుగా ఈ పాత్ర కోసం రమ్య కృష్ణను అనుకున్నారని టాక్. కానీ ఈ రోల్ కు శిల్పా శెట్టినే పర్ఫెక్ట్ చాయిస్ అని ఫిక్స్ అయ్యారట. హిందీలో ఇదే పాత్రలో టబూ బోల్డ్ గా నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

బాహబలి సినిమా తరువాత తెలుగు సినిమాలలో నటించడానికి బాలీవుడ్ తారలు ఆసక్తి చుపుతున్న నేపథ్యంలో శిల్పా శెట్టి కూడా తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. అయితే ఈ వార్తపై సినిమా టీమ్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. శిల్పా శెట్టి ఇటీవల అల్లు అర్జున్ నటించిన బుట్ట బొమ్మ పాటకు స్టెప్పు లేసి ఆదరగొట్టిన విషయం తెలిసిందే.

Related News