logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

షేక్ పేట ఎమ్మార్వో సుజాత భర్త ఆత్మహత్య..!

బంజారాహిల్స్ భూవివాదంలో చిక్కుకుని.. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన షేక్ పేట ఎమ్మార్వో సుజాత భర్త ఆత్మహత్య చేసుకున్నారు. చిక్కడ్ పల్లి పోలీస్ స్టేషన్ లోని గాంధీనగర్ లో తన చెల్లెలి ఇంటికి వెళ్లిన అజయ్ ఉదయం 7 గంటల సమయంలో ఐదంతస్తుల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

కాగా ఇటీవల ఆదాయానికి మించి ఆస్తుల కేసులో షేక్ పేట ఎమ్మార్వో సుజాతను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏసీబీ అధికారులు సుజాతతో పాటుగా ఆమె భర్త అజయ్ ను కూడా విచారించారు. ఈ నేపథ్యంలో భార్య సుజాతపై ఏసీబీ అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. భార్య అరెస్టు కావడం, అవినీతి కేసుల వల్ల సమాజంలో పరువు పోయిందన్న కారణంగా అజయ్ ఆత్మహత్యకు పాల్పడ్డట్టు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అజయ్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఏసీబీ అధికారుల వేధింపుల కారణంగానే అజయ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Related News