logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

వివాదంలో ‘లవ్ స్టోరీ’ సినిమా.. శేఖర్ కమ్ముల తెలిసే చేశాడా?

‘ఫిదా’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ప్రేమకథ సినిమా ‘లవ్ స్టోరీ’. ఈ సినిమాతో నాగ చైతన్య – సాయి పల్లవి జోడీ కట్టారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. కాగా ఇటీవల విడుదలైన ‘సారంగా దరియా’ పాట సెన్సేషన్ గా మారింది. యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. జానపదాలను కలుపుతూ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాటకు యూట్యూబ్ లో దూసుకుకుపోతుంది. అయితే ఈ పాటపై వివాదం చెలరేగుతుంది.

ఓ టీవీ కార్యక్రమంలో తాను పాడిన పాటను కాపీ చేసారంటూ కోమలి అనే గాయని ఆరోపిస్తున్నారు. గతంలో మాటీవీలో ప్రసారమయ్యే ‘రేలా రే రేలా’ అనే పాటల కార్యక్రమంలో ఆమె పాల్గొనగా ఆ కార్యక్రమానికి సుద్దాల అశోక్ తేక జడ్జిగా వ్యవహరించారు. తాను ఆ పాటను తన అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నానని తెలిపారు. అయితే తన లిరిక్స్ ను ఉపయోగించుకున్న వారు తనకు ఆ క్రెడిట్ ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేతున్నారు.

ఈ విషయం దర్శకుడు శేఖర్ కమ్ముల దృష్టికి తీసుకెళ్లి పాట పాడే అవకాశం తనకు ఇవ్వాలని కోరగా అప్పటికే పాట పూర్తయిందని వెనక్కి పంపారన్నారు. కాగా కోమలి ఆరోపణలపై తాజాగా సుద్దాల అశోక్ తేజ స్పందించారు. ఈ పాట ను తాను ఎక్కడి నుంచి కాపీ చేయలేదన్నారు. ఆమె చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ఎన్నోదశాబ్దాలుగా ఈ జానపద పాట చెలామణిలో ఉందన్నారు. సారంగ దరియా పాటలో అసలు పాటలోని పల్లవిలో కొన్ని పదాలను ఉపయోగించామని.. చరణాన్ని, సాహిత్యాన్ని మాత్రం మార్చామని ఆయన వెల్లడించారు. అయితే యువ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో ముందుండే దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాపై ఇలాంటి ఆరోపణలు రావడం గమనార్హం.

Related News