‘ఫిదా’ వంటి అందమైన లవ్ స్టోరీ తర్వాత దర్శకుడు శేఖర్ కమ్ముల మరోసారి ‘లవ్ స్టోరీ’తో వస్తున్నాడు. సాయి పల్లవి- నాగ చైతన్య జంటగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి పండగ సందర్భంగా ఆదివారం ఈ సినిమాకు సంబందించిన టీజర్ ను విడుదల చేశారు. ఒక నిమిషం నిడివి గల ఈ టీజర్ లో శేఖర్ కమ్ముల మార్కు సీన్లు యూత్ కు ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.
ఉన్నత స్థానాల్లో స్థిరపడాలనుకునే యువతి యువకులుగా సాయి పల్లవి నాగ చైతన్య కనిపిస్తున్నారు. మొదటిసారిగా నాగ చైతన్యతో తెలంగాణ యాసలో డైలాగులు చెప్పించి ప్రయోగం చేసాడు దర్శకుడు. రేవంత్ గా చైతూ, మౌనికగా సాయి పల్లవి కనిపించనున్నారు. అన్ని కుటుంబ భావోద్వేగాలను కలగలిపి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శేకర్ కమ్ముల.
ఏ ఆర్ రెహమాన్ శిష్యుడు పవన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలకు మంచి స్పందన వస్తుంది. టీజర్ చూస్తుంటేనే ఈ సినిమాతో ఈ టీమ్ మరో హిట్టు అందుకోవడం ఖాయమని తెలుస్తుంది. మరి ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.