logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

శర్వానంద్ ‘శ్రీకారం’ మూవీ రివ్యూ.. చూడొచ్చా?

టాలీవుడ్ లో కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలు రావడం ఈ మధ్య చాలా అరుదుగా మారింది. ఈ నేపథ్యంలో శర్వానంద్ ‘శ్రీకారం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో ‘శతమానం భవతి’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు విపరీతంగా కనెక్టయ్యాడు శర్వా. ఇప్పుడు వ్యవసాయం ప్రధాన నేపథ్యంగా తెరకెక్కిన శ్రీకారం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. సినిమా టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటం.. పోటీగా పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో శ్రీకారం సినిమాకు కలిసొచ్చే అంశాలుగా మరాయి. మరి ఈ అవకాశాన్ని సినిమా టీమ్ ఏ మేరకు వినియోగించుకుందో తెలియాలంటే సినిమా రివ్యూ చూసేయాల్సిందే..

కథ:
సొంతూరులో వ్యవసాయానికి అనువైన పరిస్థితులు లేని రైతులు సినిమాలో విలన్ అయిన సాయి కుమార్ దగ్గర అప్పులు చేస్తారు. ఆ అప్పులు తీర్చలేక ఆస్తులను అమ్ముకుని రోడ్డున పడుతుంటారు. అలాంటి ఒక రైతు కొడుకుగా హీరో శర్వానంద్ కనిపిస్తాడు. తండ్రి చేసిన అప్పుల గురించి తెలుసుకున్న హీరో ఆ అప్పులు తీర్చాలని అనుకుంటాడు. అందుకోసం సొంతూరిని వదిలి హైద్రాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరతాడు. అలా తండ్రికి సహాయపడతారు. ఆ తర్వాత ఊరి బాగుకోసం ఏదైనా చేయాలని భావించి లగ్జరీ లైఫ్, విదేశాలలో జాబ్ ఆఫర్ ను కూడా వదులుకుని సొంతూరికి బయలుదేరతాడు. సొంతంగా వ్యవసాయం మొదలు పెడతాడు. ఈ నేపథ్యంలో విలన్ సాయి కుమార్ నుంచి అతనికి ఎదురైన ఇబ్బందులు ఏమిటి? తాను అనుకున్నది ఎలా సాధించగలిగాడు? సాఫ్ట్ వేర్ అయిన హీరో వ్యవసాయం చేసి సక్సెస్ అవుతాడా? అనేది సినిమాలో మిగిలిన కథ.

విశ్లేషణ:
ముందుగా తెలిపినట్టుగానే శ్రీకారం ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. ఇందులో కమర్షియల్ హంగులు, ఆర్భాటాలు అంతగా కనిపించవు. దేశానికి తిండి పెట్టె వ్యవసాయం పై రాసుకున్న కథను దర్శకుడు కిషోర్ రెడ్డి ఎంతో చక్కగా ప్రెజెంట్ చేయగలిగాడు. ముఖ్యంగా సినిమా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆహ్లాదభరితంగా ఫీలింగ్ ను కలిగిస్తుంది. ఇక ఇలాంటి కాన్సెప్ట్ తో గతంలో ఎన్నో సినిమాలు వచ్చినా శ్రీకారం సినిమా కొత్తగా మాత్రం కొత్తగా అనిపిస్తుంది. రచయిత సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగులు శ్రీకారం సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయనే చెప్పాలి.

రైతులు వ్యవసాయంలో ఎదుర్కుంటున్న ఇబ్బందులను సినిమాలో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అలాగని సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. శర్వానంద్ ప్రియాంక అరుళ్ మోహన్ ల మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. విలన్ పాత్రలో సాయి కుమార్ మరోసారి అద్భుతమైన నటనను కనబరిచాడు. నిర్మాణ విలువలు, విజువల్స్ చాలా బాగున్నాయి. మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. అయితే సినిమా చాలా నెమ్మదిగా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ కచ్చితంగా చూడదగ్గ సినిమాగా నిలుస్తుంది.

ప్లస్ పాయింట్స్:
శ్రీకారం సినిమాలో శర్వానంద్, ప్రియాంక, సాయికుమార్ ల నటన మేజర్ హైలెట్. డైలాగ్స్, మ్యూజిక్ లు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.

మైనస్ పాయింట్స్:
అక్కడక్కడా కథకు అవసరం లేని కొన్ని సన్నివేశాలు, స్లో నేరేషన్ సినిమాకు మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.

రేటింగ్:
శ్రీకారం సినిమాకు ఫైనల్ గా 3/5 రేటింగ్ ఇవ్వచ్చు.

Related News