logo

  BREAKING NEWS

ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |   ద‌సరా పండుగ రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారో తెలుసా ?  |  

షారుఖ్ ను వెంటాడుతున్న కరోనా భయం?.. ఇంటికి ప్లాస్టిక్ తొడుగు!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి సినీ ప్రముఖులను వణికిస్తోంది. ఇప్పటికే బిగ్ బీ అమితాబ్ కుటుంబం కరోనా భారిన పడిన తెలిసిందే. అయితే తాజాగా బాలీవుడ్ బాద్ షాను కరోనా భయం వెంటాడుతోందని అంటున్నారు. సోషల్ మీడియాలో షారుక్ ఖాన్ కు సంబందించిన కొని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అదేమిటంటే షారుక్ నివాసాన్ని పూర్తిగా ప్లాస్టిక్ కవర్లతో చుట్టించాడు.

కరోనా గాలి ద్వారా కూడా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కుటుంబం ఈ మహమ్మారి భారిన పడకుండా ఉండాలని షారుక్ ఈ విధంగా చేసాడని అంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వార్తలో నిజం లేదని తెలుస్తుంది. కానీ షారుక్ తన ఇంటిని కవర్లతో చుట్టడం మాత్రం నిజం. కానీ అది కరోనా భయంతో కాదట.

షారుఖ్ కుటుంబం లాక్ డౌన్ మొదలైన నాటి నుండి ముంబై లోని అతని నివాసమైన మన్నత్ బంగ్లాలో ఉంటుంది. మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా వర్షాకాలంలో తమ ఇంటిని వర్షాల నుండి కాపాడుకోవడానికి షారుక్ ఈ విధంగా ప్లాస్టిక్ కవరుతో బంగ్లాను కవర్ చేస్తాడట. ఇప్పుడు అదే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News