logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

షర్మిల ఖమ్మం పర్యటన వాయిదా.. కారణం అదేనా?

వైఎస్ షర్మిల ఖమ్మం పర్యటన వాయిదా పడింది. ఇటీవల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీతో ముందుకు రానున్నట్టుగా షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసారు. నల్గొండ జిల్లా ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

త్వరలోనే పార్టీ ప్రకటన ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో షర్మిల ఖమ్మం లో పర్యటించాల్సి ఉంది. కాగా మార్చి 14 తరువాత ఈ పర్యటన ఉండనుందని షర్మిల సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఈ ఎన్నికల నేపథ్యంలో ఆమె ఈ పర్యటనను వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదిలా అండగా ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి షర్మిలతో భేటీ అయిన విషయం తెలిసిందే.

ఈ భేటీ అనంతరం షర్మిల ఖమ్మం పర్యటనను వాయిదా వేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 21 వ తేదీన ఉదయం 8 గంటలకు హైదరాబాద్ లోటస్ పాండ్ లోని షర్మిల నివాసం నుంచి భారీ ర్యాలీగా షర్మిల పర్యటన మొదలవుతుందని రాఘవరెడ్డి ప్రకటించిన విషయం తెలిసందే. దారి పొడవునా షర్మిలకు స్వాగతం పలకడానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Related News