logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

ఆంధ్రా బిడ్డనే కాదు.. తెలంగాణ కోడలిని కూడా : షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు!

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీకి షర్మిల కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం లోటస్ పాండ్ లోని ఆమె నివాసంలో వైఎస్సార్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రంగారెడ్డి, హైదరాబాద్ కు చెందిన ముఖ్యనేతలు ఈ సమావేశానికి భారీగా హాజరయ్యారు. తెలంగాణాలో ఎలా ముందుకు వెళ్లాలనే భవిష్యత్ కార్యాచరణపై షర్మిల చర్చించారు. కొత్త పార్టీపై వారి నుంచి అభిప్రాయం సేకరణను నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ..

జై తెలంగాణ నినాదంతో ఆమె తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. తెలంగాణాలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామన్నారు. తెలంగాణలోని పేదలంతా సంతోషంగా ఉన్నారా? లేదా అనే విషయం తెలుసుకుంటామన్నారు. కుల, మతాలకు అతీతంగా వైఎస్ తెలుగు ప్రజలను ప్రేమించారన్నారు. తెలంగాణ ప్రజలను వైఎస్ గుండెల్లో పెట్టుకున్నారు. వైఎస్ లేరన్న వార్త విని ఆ దుఃఖం భరించలేక మరణించిన వారిలో తెలంగాణ ప్రజలే అధికంగా ఉన్నారన్నారు.

ప్రతి పేద విద్యార్థికి ఉన్నత విద్య అందాలని వైఎస్ కళలు కన్నారన్నారు. నేను ఆంధ్ర బిడ్డనే కాదు తెలంగాణ కోడలిని కూడా అంటూ షర్మిల ప్రసంగించారు. కాగా నిన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో సమావేశమైన షర్మిల రెండో విడత సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఆ తర్వాత జిల్లాల వారీగా నేతలను కలుసుకోనున్నట్టుగా తెలుస్తుంది.

Related News