logo

  BREAKING NEWS

మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |   ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ నోటిఫికేషన్ రద్దు!  |   బ్రేకింగ్: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..!  |   మున్సిప‌ల్ ఎన్నిక‌లపై సీక్రెట్ స‌ర్వే.. రిజ‌ల్ట్ చూసి షాకైన జ‌గ‌న్‌  |   బంగారం కొనేవారికి బ్యాడ్‌ న్యూస్.. పెరిగిన బంగారం ధ‌ర‌లు  |   బ్రేకింగ్: నిమ్మగడ్డ వివాదాస్పద నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు.. భారీ ఎదురుదెబ్బ!  |   ఆనాడు జగన్ ను అడ్డుకున్నారు.. బాబుపై ఏపీ మంత్రి ధ్వజం  |   మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!  |   హైటెన్షన్: చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. ఎయిర్పోర్టులో బైఠాయింపు!  |  

తెలంగాణలో కొత్త పార్టీ.. క్లారిటీ ఇచ్చిన వైఎస్ షర్మిల!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. త్వరలోనే తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెడతారంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనం చర్చనీయాంశంగా మారింది. కొంత మంది పార్టీ నేతలు కూడా ఈ అంశంపై స్పందించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఈ విషయంపై స్పందిస్తూ.. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం వలన ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఇదిలా ఉండగా తాజాగా తనపై వస్తున్న వార్తలపై వైఎస్ షర్మిల స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని దురుద్దేశ్యపూర్వకంగా రాసిన వార్తలంటూ ఆమె మండిపడ్డారు.

ఈ విషయం ఆలస్యంగా తన దృష్టికి వచ్చిందన్నారు. ఏ పత్రిక అయినా, ఛానెల్ అయినా ఒక కుటుంబం గురించి రాయడమే తప్పు. ఇది నీతిమాలిన చర్య. ఇలాంటి రాతలు రాసిన పత్రిక, ఛానెల్ పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related News