logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

హ‌రీష్‌ శంక‌ర్ వ‌ర్సెస్ బండ్ల గ‌ణేష్‌.. క్రెడిట్ కోసం కొట్లాట‌

ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్‌కు ప్రొడ్యూస‌ర్ బండ్ల గ‌ణేష్ మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తోంది. గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా వ‌చ్చి ఎనిమిదేళ్లు పూర్తైన సంద‌ర్భంగా ఆ సినిమా ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వీరి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌ల‌కు కార‌ణ‌మైంది. ఒక‌రిపై ఒక‌రు ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా వ‌చ్చిన ఎనిమిదేళ్లు అయినందున సినిమా కోసం స‌హ‌క‌రించిన అంద‌రికీ హ‌రీష్ శంక‌ర్ ఓ ట్వీట్‌లో కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. ఇందులో సినిమా ప్రొడ్యూస‌ర్ బండ్ల గ‌ణేష్ పేరు లేదు.

ఇది బండ్ల గ‌ణేష్‌కు కోపం తెప్పించింది. ఎన్టీఆర్‌తో సినిమా ఛాన్స్ దొర‌క‌క డిప్రెష‌న్‌లో ఉన్న హ‌రీష్ శంక‌ర్‌ను పిలిచి గ‌బ్బ‌ర్ సింగ్ ఛాన్స్ ఇప్పించాన‌ని బండ్ల గ‌ణేష్ చెప్పాడు. హ‌రీష్ శంక‌ర్‌కు రీమేక్ సినిమాలు మాత్ర‌మే తీయ‌డం వ‌చ్చ‌ని, స్ట్రైట్ సినిమాలు తీయ‌డం రాద‌ని కూడా ఎద్దేవా చేశాడు. బండ్ల గ‌ణేష్ కామెంట్స్‌పై హ‌రీష్ శంక‌ర్ కూడా సీరియ‌స్‌గానే స్పందించాడు.

ఎవ‌రు ఎవ‌రినైనా బ‌ద‌నాం చేయ‌వ‌చ్చ‌ని చెప్పిన హ‌రీష్ శంక‌ర్‌.. బండ్ల గ‌ణేష్‌కు ఆంజ‌నేయులు, తీన్‌మార్ సినిమాల‌తో ఫ్లాప్‌ల‌లో ఉన్న‌ప్పుడు తాను గ‌బ్బ‌ర్ సింగ్ తీసి హిట్ ఇచ్చాన‌ని తాను కూడా అన‌వ‌చ్చ‌ని అన్నాడు. నిజానికి తాను ఫ్లాప్స్‌తో ఉన్న‌ప్పుడు గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా ఇచ్చింది మాత్రం ప‌వ‌న్ క‌ళ్యాణేన‌ని అన్నాడు. ఆ సినిమాకు నాగ‌బాబు నిర్మాతగా అనుకున్న‌ట్లు చెప్పాడు.

Related News