logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

మీ పిల్లలు చదువులో వెనకపడుతున్నారా? ఈ మొక్కను ఇంట్లో పెంచండి!

శంకుపుష్పి సంస్కృతంలో దీనినే విష్ణుక్రాంత, అపరాజిత అని కూడా పిలుస్తారు. ఆయుర్వేద వైద్యంలో ఈ మొక్కకు ఎంతో విశిష్టత ఉంది. స్త్రీ యోని భాగంలా కనిపించే ఈ చెట్టు పువ్వులు మగవారికి ప్రత్యేక ప్రయోజనాలను కలిగిస్తాయి. రకరకాలైన వ్యాధులకు చికిత్స చేయడంలో ఈ పువ్వులను వినియోగిస్తారు. ఈ చెట్టును ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంటికి ఎంతో శోభను తెస్తుంది. ఈ పువ్వులు సహజమైన యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటాయి. అందంతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా ఇవ్వడంలో సహాయపడతాయి. అందుకే చర్మ సౌందర్య ఉత్పత్తులలో దీనిని అధికంగా వినియోగిస్తారు.

ఇందులో ఉండే కొల్లాజెన్ కారణంగా చర్మం సాగకుండా చేసి ముడతలు పడకుండా కాపాడుతుంది. శంకు పుష్పి మొక్కలో ప్రతీభాగం లో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ పువ్వులతో టీని తయారు చేసుకుని తాగుతారు. పురుషులు ఈ టీని తాగడం వలన భార్యా భర్తల మధ్య దాంపత్య విలువలను పెంచే సాధనంగా ఉపయోగపడుతుంది. పురుషుల్లో శుక్రకణాల ఉత్పత్తిని పెంచి శృంగార ప్రేరేపితంగా కూడా ఇది పని చేస్తుంది. అందువల్ల సంతాన సమస్యలు రమ్మన్నా రావు.

రక్తంలో గ్లూకోజ్ నిల్వలను పేరుకుపోకుండా చేస్తుంది. ముఖ్యంగా జ్ఞాపక శక్తికి సంబందించిన సమస్యలను తగ్గిస్తుంది. నిద్రలేమి సమస్యకు, డిప్రెషన్ తో బాధపడేవారికి శంకు పూలతో చేసిన టీని తాగిస్తారు. ఆడవారు నెలసరి ఇబ్బందులతో బాధపడుతుంటే ఈ పూలతో చేసిన టీ అద్భుతంగా పని చేస్తుంది. మద్యపానం అలవాటు ఉన్నవారు తరచుగా అలసటకు గురయ్యే వారు ఈ మొక్కలోని ఏ భాగాన్నైనా నీటిలో మరిగించి తీసుకుంటే అలసట దూరమవుతుంది. కొత్త శక్తి లభిస్తుంది.

ఐదు శంకు పుష్పి పూలను నీటిలో పది నిమిషాల పాటు నానబెట్టి ఆ నీటిని తేనెతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి నీతో మేలు చేస్తుందని ఆయుర్వేదం చెప్తుంది. అయితే గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు దీనికి దూరంగా ఉండటమే మంచిది. శంఖుపుష్పి పూలతో చేసిన నీటిని చర్మంపై రాస్తే అక్కడ చర్మం నిగారింపును పెంచుతుంది. హైపర్ థైరాయిడిజం సమస్యను తగ్గించడంలో ఈ శంఖుపుష్పి ప్రభావవంతంగా పని చేస్తుందని ఇటీవల కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఈ మొక్క అందుబాటులో లేని వారికి మార్కెట్లో శంఖుపుష్పి సిరప్ లు లభిస్తాయి. చదువులో వెనకపడిం పిల్లలకు ఈ సిరప్ ను తగిన మోతాదులో ఇవ్వడం వలన వారి జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

 

Related News
%d bloggers like this: