శృంగార తార షకీలా జీవితం ఆధారంగా ఓ బయో పిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాలో షకీలా పాత్రలో బాలీవుడ్ నటి రిచా చద్దా నటిస్తుంది. వెండి తెరపై మెరవాలన్న తాపత్రయంతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన షకీలా శృంగార తారగా ఎలా మారింది? ఆమె జీవితంలో తెర వెనకాల జరిగిన కోణాలేమిటి? షకీలా క్రేజ్ మసకబారడానికి కారణం ఎవరు? అనే ఆసక్తికర విషయాలను ఈ బయో పిక్ ద్వారా ప్రేక్షకులను చూపించబోతున్నారు.
కాగా ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. కొత్త సంవత్సరం కానుకగా ఈ సినిమాను జనవరి 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా తాజాగా షకీలా సినిమా ట్రైలర్ విడుదల చేసారు సినిమా యూనిట్. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెంచుతుంది.