logo

  BREAKING NEWS

8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |  

సామూహిక ఆత్మహత్యల కేసులో కీలక ట్విస్ట్.. బయటపెట్టిన సెల్ఫీ వీడియో!

నంద్యాలకు చెందిన షేక్ అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 3వ తేదీన మూలసాగరం ప్రాంతానికి చెందిన అబ్దుల్‌సలామ్‌ (45) తన భార్య నూర్జహాన్‌ (38), కుమార్తె సల్మా (14), కుమారుడు దాదా ఖలంధర్‌ (10)తో కలిసి మంగళవారం గూడ్స్‌ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. తాజాగా సలాం కుటుంబం ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోను రికార్డు చేశారు. ఈ వీడియో బయటకు రావడంతో ఈ కేసులో అసలు విషయాలు బయటకు వచ్చాయి. తన ఆత్మహత్యకు కారణం పోలీసులేనంటూ ఆ కుటుంబం బోరున విలపించింది.

సలాం ఆటో డ్రైవర్ గా పని చేస్తుండగా అతని ఆటోలో ప్రయాణించిన వ్యక్తి రూ. 70 వేల రూపాయలను పోగొట్టుకున్నాడు. దీంతో సలాం ను పోలీసులు స్టేషన్ కు పిలిపించి విచారించారు. తనకు సంబంధం లేని కేసులో పోలీసులు తనను ఇరికించారని తమ కుటుంబానికి సహాయం చేయడానికి ఎవరూ లేరని, తామింక బతకలేమంటూ ఆవేదన వ్యక్తం చేసాడు.

అనంతరం భార్య, ఇద్దరు పిల్లలతో కర్నూలు జిల్లా పాణ్యం మండల పరిధిలోని కౌలూరు గ్రామ సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ కు వెళ్లారు. గూడ్సు రైలు వీరిపై నుండి వెళ్లడంతో కుటుంబం మొతం అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన పలువురిని కంటతడి పెట్టిస్తుంది.

Related News