logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

దేశ చరిత్రలో తొలిసారి ఓ మహిళకు ఉరిశిక్ష.. ఇంతకీ ఆమె చేసిన నేరమేంటీ?

దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని ఓ ఘటన చోటుచేసుకోబోతుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి ఓ మహిళకు మన దేశంలో ఉరిశిక్షను అమలు చేయబోతున్నారు. బ్రిటీషు ఇండియా కాలంలో 1870 లో ఓ మహిళకు చివరి సారిగా ఉరిశిక్షను అమలు చేశారు. మళ్ళీ ఇన్నేళ్లకు ఉత్తరప్రదేశ్ లోని మథుర హైకోర్టు వెలువరించిన ఈ తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది. ఓ అరుదైన కేసులో దోషిగా తేలిన షబ్నమ్ అనే మహిళను చనిపోయే వరకు ఉరి తీయాలంటూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

ఎంతటి కఠిన నేరాలకు పాల్పడిన నేరస్తులకైనా న్యాయస్థానం ఒక చివరి అవకాశం ఇస్తుంది. కానీ షబ్నమ్ కు మాత్రం ఈ కేసులో అన్ని దారులు మూసుకుపోయాయి. చివరి అవకాశంగా రాష్ట్రపతి క్షమాభిక్షను అభ్యర్థిస్తే అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దానికి తిరస్కరించారు. ఇంతకీ షబ్నమ్ చేసిన నేరమేమిటీ? అంటే ఈ కేసు గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిందే.

అది ఏప్రిల్ 2008 సంవత్సరం. ఉత్తరప్రదేశ్ కు చెందిన షబ్నమ్ ఇంగ్లీషులో ఎంఏ, జాగ్రఫిలో పట్టా పొందించి. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు కూడా. ఆమెకు అదే ప్రాంతానికి చెందిన సలీంతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం అతనితో శారీరక సంబంధానికి దారి తీసింది. పెళ్ళికి ముందే షబ్నమ్ దారి తప్పడంతో కుటుంబ సభ్యులు ఆమెను గట్టిగా మందలించారు. ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళింది. అయినప్పటికీ ఆమె తీరులో ఎలాంటి మార్పు లేదు. చివరకు సలీంను పెళ్లి చేసుకుంటానని తన కుటుంబ సభ్యులను కోరింది. సలీం కారణంగానే తమ కూతురు ఈ స్థితికి వచ్చిందనే కోపంతో అందుకు వారు ఒప్పుకోలేదు. షబ్నమ్ ను గృహనిర్బంధం చేశారు. కుటుంబ సభ్యులపై కక్ష పెంచుకున్న షబ్నమ్ 2008 ఏప్రిల్ నెలలో ప్రియుడితో కలిసి కుటుంబ సభ్యుల హత్యకు పథకం వేసింది. 14వ తేదీ అర్థరాత్రి ఆమె తన కుటుంబానికి చెందిన 7 మందిని గొడ్డలితో నరికి అత్యంత పాశవికంగా హత్య చేసింది. ఒక్కొక్కరి తలలు నరికి మొండాన్ని వేరు చేసింది. ఈ హత్యాఖాండలో షబ్నమ్ ప్రియుడు కూడా పాలుపంచుకున్నాడు.

షబ్నమ్ చేతిలో హత్యకు గురైన వారిలో ఆమె తల్లిదండ్రులు, అన్నా వదినలు, షబ్నమ్ తమ్ముడు, 14 ఏళ్ల సోదరి, అన్న కుమారుడైన 10 ఏళ్ల బాలుడు కూడా ఉన్నారు. ఐదు రోజుల తర్వాత ఈ కేసులో పోలీసులు షబ్నమ్, సలీంలను అరెస్టు చేసారు. వారిద్దరిని జైలుకు తరలించే క్రమంలో వైద్య పరీక్షలు నిర్వహించగా అప్పటికే షబ్నమ్ ఏడు వారాల గర్భవతి అని తేలింది. 2010లో ఈ కేసులో మథుర కోర్టు నిందితులకు మరణించేవరకు ఉరి తీయాలంటూ సంచలన తీర్పు నిచ్చింది. కోర్టు తీర్పును సవాలు చేస్తూ అలహాబాద్ హై కోర్టును ఆశ్రయించగా కోర్టు వారి రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది. 2015 లో సుప్రీం కోర్టులో కూడా షబ్నమ్ సలీం లకు చుకెదురయ్యింది. చివరి అవకాశంగా రాష్ట్రపతి ముందు క్షమాభిక్షను అభ్యర్థిస్తే అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది.

అయితే దోషులను ఎప్పుడు ఉరి తీయాలనే విషయాన్నీ ఇంకా స్పష్టం చేయలేదు. కానీ అందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు జైలు అధికారులు. మన దేశంలో మహిళలకు ఉరిశిక్షను అమలు చేయడానికి మథుర జైలులో ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. 150 ఏళ్లుగా ఆ గదిని తెరిచే అవసరం ఏర్పడలేదు. మళ్ళీ షబ్నమ్ కోసం ఆ గదిని సిద్ధం చేస్తున్నారు జైలు అధికారులు. నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్షను అమలు చేసిన పవన్ జల్లాద్ షబ్నమ్ ను కూడా ఉరి తీయనున్నారు. అయితే ఈ కేసులో ఉరి తేదీని న్యాయస్థానం వెల్లడించాల్సి ఉంది.

 

Related News