logo

  BREAKING NEWS

రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |   కేంద్రంపై రైతుల దండయాత్ర ఎందుకు? నూతన వ్యవసాయ చట్టాల్లో ఏముంది?  |  

ఏసీబీ వలలో షాబాద్ సీఐ.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి..!

ప్రజలను రక్షించాల్సిన పోలీసులే అవినీతి వైపు అడుగులు వేస్తున్నారు. లంచాలు తీసుకుంటూ పట్టుబడి సమాజంలో పరువు పోగొట్టుకుంటున్నారు. తాజగా ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. రంగారెడ్డి జిల్లాలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని షాబాద్ పోలీస్ స్టేషన్ లో సీఐ శంకర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.

ఓ కేసు విషయంలో తన వద్దకు వచ్చిన బాధితుల నుంచి ఏకంగా రూ. 25 లక్షలు డిమాండ్ చేసాడు. బాధితుడు ముందుగానే ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ క్రమంలో పక్కా ప్లాన్ ప్రకారం గురువారం సీఐ, ఏఎస్ఐ ల‌ను లంచం తీసుకుంటున్న సమయంలో రైడ్ చేసి పట్టుకున్నారు. వీరిద్దరిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసారు. కాగా కేసుపై దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related News