logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

‘కోకిలమ్మ’ సీరియల్ హీరోపై లైంగిక వేధింపుల కేసు నమోదు!

బుల్లితెరపై ప్రసారమయ్యే ‘కోకిలమ్మ’ సీరియల్ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యింది. సక్సెస్ ఫుల్ గా 800 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ సీరియల్ హీరో సమీర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. సమీర్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఇద్దరు యువతులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

మణికొండకు చెందిన శ్రీ విద్య, అపర్ణలు బోటిక్ నడుపుకుంటూ వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఫ్లాట్ కు వచ్చిన సమీర్ తమతో అసభ్యంగా ప్రవర్తించాడని తమపై దాడికి పాల్పడ్డాడని యువతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అతనితో వచ్చిన మరో ముగ్గురు స్నేహితులు కూడా తమపై దాడి యత్నం చేశారన్నారు.

ఈ సమయంలో సమీర్ ప్రియురాలు స్వాతి కూడా వీరితో ఉందని అంటున్నారు. కాగా సమీర్ తమ దగ్గర రూ. 5 లక్షలు తీసుకున్నాడని ఆ డబ్బు తిరిగి ఇవ్వమని అడగడంతోనే తమపై దాడికి యత్నించాడని ఆరోపిస్తున్నారు. కాగా ఈ ఘటనపై సైబరాబాద్ పరిధిలోని రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related News