logo

  BREAKING NEWS

అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |   వ్యాయామం ఏ వయసు వారు ఎంతసేవు చేయాలి: డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలు  |   బ్రేకింగ్: మంత్రి పేర్ని నానిపై హ‌త్యాయ‌త్నం  |   తెలంగాణలో కరోనా అప్ డేట్.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?  |   ‘సర్జికల్ స్ట్రయిక్స్’ అంటే ఏమిటి? ఎలాంటి సందర్భాలలో నిర్వహిస్తారు?  |   బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |  

హెల్మెట్ లేకుండా పట్టుబడితే.. రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం

హైద్రాబాద్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోనున్నారు పోలీసులు. ఇదివరకే మోటార్ వెహికిల్ చట్టం 206కి మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందుకు సంబందించిన కొత్త మార్గదర్శకాలను విడుదల చేసారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న కఠిన నిబంధనలను నగరంలో కూడా అమలు చేయనున్నారు.

హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం అనేది రాష్ట్రంలో అత్యధిక రహదారి ఉల్లంఘనలలో ఒకటిగా ఉంది. ఇకపై వాహనదారులు హెల్మెట్ లేకుండా పట్టుబడితే మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేయనున్నారు. రెండవ సారి హెల్మెట్ లేకుండా పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ పై జీవిత కాలం నిషేధం విధించనున్నారు. ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ సిగ్నల్ జంపింగ్ లకు పాల్పడిన వాహనదారులకు కూడా ఈ కొత్త నిబంధనలు వర్తింపజేయనున్నట్టుగా తెలిపారు.

మోటారు వాహనాల చట్టం లోని సెక్షన్ 129 ప్రకారం.. ద్విచక్రవాహనదారులు నడిపే ప్రతి ఒక్కరు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలకు అనుగుణంగా హెల్మెట్ ధరించవలసి ఉంటుంది. లేదంటే వారికి రూ. 1000 జరిమానాతో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ పై మూడు నెలల నిషేధం విధిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ నిబంధనలు సైబరాబాద్ పోలీసులు అమలు పరుస్తున్నారు.

Related News