logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

షాకింగ్: సీరియల్ హీరో రవిక్రిష్ణకు కరోనా.. ఆందోళనలో టీవీ పరిశ్రమ!

బుల్లితెరను కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. ఇటీవల కొందరు సీరియల్ నటులు కరోనా భారిన పడటం వారి అభిమానులను కలవరపెడుతుంది. సీరియ్సల్ హీరోయిన్ నవ్య స్వామి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. రెండు రోజులు గడవక ముందే మరో నటుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్, సీరియల్ హీరో రవికృష్ణ కు కరోనా పాజిటివ్ అని తేలింది.

ఈ విషయాన్ని రవికృష్ణ స్వయంగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలిపాడు. తనకు పరీక్షలు చేయించగా ఈ విషయం నిర్దారణ అయ్యిందన్నారు. మూడు రోజుల నుంచి తాను సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటున్నానని, దేవుడి దయ వల్ల తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని తెలిపాడు. తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, ఐసోలేషన్ ఉండాలని కోరాడు.

అయితే కరోనా ఎలా వచ్చిందో తనకు కూడా అర్థం కావడం లేదని పోస్టులో వివరించాడు. ఇక తనకు కరోనా వచ్చిందని తాను ఏమాత్రం బాధ పడటం లేదని.. పాజిటివ్ దృక్పథంతో త్వరలోనే ఈ వైరస్ నుంచి బయటపెడతానని ఆశా భావం వ్యక్తం చేసాడు. కాగా రవికృష్ణ, నవ్య స్వామి కలిసి ఓ సీరియల్ లో కలిసి నటిస్తున్నారు. అయితే ఇప్పుడు వీరి ద్వారా ఇంకా ఎంతమందికి కరోనా పాజిటివ్ వస్తుందోనని టీవీ పరిశ్రమలో ఆందోళన మొదలైంది.

Related News