logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

గోపిచంద్ తో బోల్డ్ సన్నివేశాలపై స్పందించిన రాశి

టాలీవుడ్ లో అందాల తారల జాబితాల లిస్టు తీస్తే అందులో రాశి పేరు కచ్చితంగా ఉంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అందమైన నటి కెరీర్ మొదట్లో రెండు తరాల జనరేషన్ ని పూర్తిగా తనవైపుకు తిప్పుకుంది. నవ్వుతోనే ఎంతో మంది కుర్రకారు మతులు పోగొట్టింది. ఇప్పటికీ నేటి తరం యువత కూడా రాశి అందానికి అభిమానులే.

అయితే పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఇపుడు మళ్ళీ అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ‘రాశి విజన్స్’ పేరుతో ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్ ను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఛానల్ ద్వారా ఆమె అభిమానుల ప్రశ్నలు సమాధానాలు కూడా ఇస్తున్నారు. తాజాగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు రాశి స్పందించారు. దర్శకుడు తేజ మహేష్ బాబు కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘నిజం’ సినిమాలో రాశి- గోపీచంద్ మధ్య వచ్చే సీన్లు ఎంత బోల్డ్ గా ఉంటాయో తెలిసిందే.

సినిమా కెరీర్ మొదలు పెట్టిన రోజు నుంచి నేను హోమ్లీ పాత్రలే చేస్తూ వచ్చాను. ప్రేక్షకులు కూడా నన్ను అలాగే చూడటానికి ఇష్టపడ్డారు. కానీ నిజం సినిమాలో లాంటి పాత్రలో మళ్ళీ కనిపించదలుచుకోలేదు. నన్ను సంప్రదించే వారు కూడా నాకు అలాంటి పాత్రలే ఆఫర్ చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఇకపై బోల్డ్ పాత్రలో నటించే ఉదేశ్యం లేదని స్పష్టం చేసింది.

Related News