ఏపీలోని రామతీర్థం ఘటనపై ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై నటుడు, సీనియర్ హీరో సుమన్ స్పందించారు. రాష్ట్రంలో పలు ఆలయాల్లోకి విగ్రహాల ధ్వంసం ఘటనలు తనను బాధించాయన్నారు. ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆలయ భద్రతపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసారు. సీఎం జగన్ కు చెడ్డపేరు తీసుకువచ్చేందుకు ప్రతిపక్షాలు పన్నిన కుట్రగా సుమన్ అభిప్రాయపడ్డారు. ఆధారాలు లేకుండా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదన్నారు. దేవుడే వారిని శిక్షిస్తాడన్నారు. హిందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ దేవాలయాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.