logo

  BREAKING NEWS

తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |   జ‌గ‌న్‌ను ఓడించే కుట్ర‌..? కొడాలి నాని పాత్ర‌..?  |   బ్రేకింగ్‌: జ‌గ‌న్ ఇంటి ముట్ట‌డి.. హైద‌రాబాద్‌, తిరుప‌తిలో ఉద్రిక్త‌త‌‌  |   బ్రేకింగ్: డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త పేరు  |   అమెరికా నుంచి ఎలా వ‌చ్చింది..? ‘కాంగ్రెస్ గ‌డ్డి’ అని ఎందుకు పిలుస్తారు ?  |   తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్య‌క్షుడి పేరు ఖ‌రారు  |   ఇక నుంచి ‘యాదాద్రి’ రైల్వే స్టేష‌న్‌  |   హ‌రీష్ రావు వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్‌రావు  |   ఈ చిన్న ప‌ని చేస్తే 15 నిమిషాల్లో త‌ల‌నొప్పి మాయం  |   రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే  |  

‘పిచ్చి పట్టిందా’ అంటూ ఫ్యాన్స్ పై మండిపడ్డ సెహ్వాగ్.. ఆ అభిమానులు ఏం చేసారు?

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కు అభిమానులపై కోపమొచ్చింది. ఈ విషయంపై సెహ్వాగ్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డాడు. మీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ ట్వీట్ పై నెటిజన్లు కూడా సెహ్వాగ్ కె మద్దతు తెలుపుతున్నారు. అయితే ఆయనకు ఇంతలా కోపం తెచ్చే పని ఆ అభిమానులు ఏం చేశారో తెలిస్తే అతని కోపానికి అర్థం ఉందని తెలుస్తుంది.

భారత క్రికెట్ జట్టులో ఉన్న ప్లేయర్లకు అభిమానులకు మధ్య ఎంతటి విడదీయలేని బంధం ఉంటుందో తెలిసిందే. అయితే ఈ అభిమానం హద్దు మీరు ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. మహారాష్ట్ర లోని కొల్హాపూర్ కు చెందిన కొందరు యువకులు ఒకరు ధోని గొప్పంటే మరొకరు రోహిత్ శర్మ గొప్పంటూ గొడవ పడ్డారు. దీంతో ఓ యువకుడిని మరో క్రికెటర్ అభిమానులు చెరుకు తోటకు తీసుకు వెళ్లి అతనిపై విచక్షణారహితంగా దాడి చేసారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఘటనపై సెహ్వాగ్ స్పందిస్తూ. మీకేమైనా పిచ్చి పట్టిందా.. మేమంతా దేశం కోసం ఆడతాము. ఒకరితో ఒకరం కలుసుకోలేకపోయినా అంతా కలిసి కృషి చేసేది దేశాన్ని గెలిపించడానికె ఆ విషయం గుర్తు పెట్టుకోండి. ఎప్పటికైనా మేమంతా ఒకటే కానీ కొందరు అభిమానం పేరుతో ఇలా హద్దు మీరు ప్రవర్తిస్తుంటారు. ఇలా ఇంకెప్పుడూ చేయకండి అంటూ సెహ్వాగ్ ఘాటుగా స్పందించారు.

Related News