logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

రాముడిగా ప్రభాస్.. సీత ఎవరో తెలుసా?

ఐదేళ్ల పాటు శ్రమించి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ప్రభాస్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన సాహో సినిమాతో 400 కోట్లను కొల్లగొట్టి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసాడు. ఈ సినిమా కారణంగా వచ్చిన అతి పెద్ద గ్యాప్ ప్రభాస్ అభిమానులను ఒకింత నిరాశకు గురి చేసింది. దీంతో ఇప్పుడు ప్రభాస్ వరుస పెట్టి సినిమాలను విడుదల చేయడానికి సిద్దమవుతున్నాడు. సాహో సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే రాధే శ్యామ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జిల్ ఫెమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వివిధ కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.

తాజాగా రాధే శ్యామ్ సినిమాను మళ్లీ పట్టాలెక్కించనున్నారు. ఇదిలా ఉండగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ తో కూడా మరో పిరియాడికల్ మూవీ రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ తో పూజా హేగ్దే రొమాన్స్ చేయనుంది. అయితే ఇప్పుడు ప్రభాస్ అభిమానులకు అన్నిటికన్నా పెద్ద శుభవార్త.. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న అది పురుష్ సినిమా ప్రకటన. బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్ ఆఫ్ ది డికేడ్‌ అంటూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమాను ప్రకటించడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రభాస్ మేనియా కొనసాగుతుంది.

బాలీవుడ్ లో తానాజీ సినిమాకు దర్శకత్వం వహించిన ఓం రౌత్ ప్రభాస్ కోసం ఏకంగా 16 నెలల పాటు కష్టపడి ఆది పురుష్ కథను తయారు చేసాడట. ప్రభాస్ కు కూడా కథ నచ్చడంతో ఈ స్క్రిప్ట్ ను ఒకే చేసేసాడు. దీంతో ఏకంగా 500 కోట్ల బడ్జెట్ తో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండ‌టం.. ఆదిపురష్ టైటిల్ లోగో సైతం.. సోషియో ఫాటసీ కథా నేపథ్యంలోనే ఉండటంతో ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడనే సంకేతాలు గట్టిగానే వస్తున్నాయి.

ఇటీవల దర్శక ధీరుడు రాజమౌలి కూడా ఈ విషయంపై హింట్ ఇవ్వడంతో ఈ వార్త ఇప్పుడు రెబల్ స్టార్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఇప్పటివరకు కనిపించని ఓ సాఫ్ట్ లుక్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ప్రభాస్ విలువిద్యలో శిక్షణ తీసుకుంటున్నట్టుగా దర్శకుడు ఓం రౌత్ వెల్లడించాడు. ఇప్పుడు ఈ సినిమాపై అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే. ప్రభాస్ రాముడిగా కనిపిస్తే రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.

మరి సీతగా నటించే హీరోయిన్ ఎవరు? ఎంత పాన్ ఇండియా సినిమా చేస్తున్నా ప్రభాస్ దక్షిణాది హీరో. అతని పక్కన తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని ఉత్తరాది భామను నటింపజేస్తామంటే ఇక్కడి అభిమానులకు రుచించడం లేదు. ప్రభాస్ కటౌట్ కు అనుష్క శెట్టి జోడీగా పర్ఫెక్ట్ అనిపించినా మరోసారి ఈ కాంబినేషన్ ను రిపీట్ చేసే అవకాశం లేదు. ఇప్పటికే ప్రభాస్ పక్కన శ్రద్ధ కపూర్ నటించగా.. ఇప్పుడు పీరియాడికల్ ఫిలిం కోసం దీపికా తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తుంది. ఉత్తరాది హాట్ ఫెవరెట్ అయిన కియారా అద్వాని ఈ పాత్ర‌కు బాగుంటుంది అని భావించార‌ట‌. కానీ, బాలీవుడ్ హీరోయిన్లను సీత పాత్రలో ఊహించుకోలేమని సోషల్ మీడియాలో సినిమా టీంకు అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి.

దీంతో ఈ సినిమా కోసం దక్షిణాది హీరోయిన్ పేరునే పరిశిలీస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా మహానటి సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్.. ప్రభాస్ కు ఆమె పేరును సిఫారసు చేసే అవకాశాలు ఉన్నాయి. బాలీవుడ్ నుంచి ఈ పాత్ర కోసం చాలా మంది హీరోయిన్లు పోటీ పడుతుండగా ప్రభాస్ మాత్రం కీర్తి సురేష్ వైపే మొగ్గు చూపుతున్నడు. దీంతో దాదాపు ఈ సినిమాలో కీర్తి కంఫర్మ్ అయినట్టే అని తెలుస్తుంది.

Related News