logo

  BREAKING NEWS

బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |  

సికింద్రాబాద్: టెక్ మహీంద్రా భవనంపై నుండి దూకి యువతి మృతి!

సికింద్రాబాద్ టెక్ మహీంద్రా కాల్ సెంటర్ లో పని చేస్తున్న యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పట్టపగలు వందలాది మంది పనిచేసే షిఫ్టులులోనే యువతి భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సుష్మిత అనే యువతి గురువారం ఉదయం తాను పనిచేస్తున్న కార్యాలయం భవనం 6వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

పెద్ద శబ్దం రాగా స్థానికులు, సెక్యూరిటీ సిబ్బంది గమనించి చూడగా అప్పటికే యువతి మృతి చెందింది. కాగా సుష్మిత మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయంపై ఎంక్వైరీ చేస్తున్నారు.

 

Related News