logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

రెండవ సారి కరోనా.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..?

కరోనా మహమ్మారి నుంచి కోలుకుని బయటపడినవారంతా ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. మన దేశంలో రికవరీ రేటు కూడా అధికంగానే ఉంది కాబట్టి ఈ ఏడాది చివరాఖరి వరకు వాక్సిన్ వచ్చినా రాకపోయినా వైరస్ ప్రభావం తగ్గుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండవసారి కరోనా వైరస్ సోకుతుందనే వార్త ప్రజలకు షాకిస్తుంది.

తెలంగాణలో సైతం ఇలాంటి కేసులు నమోదవుతున్నాయని అధికారులు కూడా వెల్లడించడంతో ఈ వైరస్ మళ్ళీ సోకితే ఆ ప్రభావం ఎలా ఉంటుందోనని అంతా ఆందోళనకు గురవుతున్నారు. కాగా రెండవ సారి కరోనా సోకడంపై శాస్త్రవేత్తలు ప్రజలకు క్లారిటీ ఇచ్చారు. కరోనా సోకిన వ్యక్తుల్లో అత్యంత వేగంగా న్యూట్రలైజింగ్ యాంటీ బాడీలు విడుదల అవుతున్నాయని, రెండు మూడు నెలల తర్వాత వాటి సంఖ్య తగ్గిపోతుందని వెల్లడించారు. కోలుకున్నవారి శరీరం నుంచి వైరస్ పూర్తిగా బయటకు వెళ్ళవలసిన అవసరం ఉందన్నారు. కొందరిలో వైరస్ కు సంభందించిన మృత కణాలు అలాగే ఉండటం వల్ల పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా వస్తుందన్నారు.

అయితే ఎలాంటి రోగ లక్షణాలు ఉండటం లేదని వీరి నుంచి ఇతరులకు కరోనా సోకె ప్రమాదం లేదని స్పష్టం చేశారు. కౌన్సిల్ ఆఫ్ సైన్టిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ – ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రిటీవ్ బయాలజీ డైరెక్టర్ అనురాగ్ శర్మ ఈ అంశంపై స్పందిస్తూ.. రెండవసారి కరోనా సోకినా కేసులు ఇప్పుడిప్పుడే గుర్తించడం జరిగింది. అయితే వీరిలో ఇప్పటివరకు ఎలాంటి కరోనా లక్షణాలు గుర్తించలేదు. మొదటి సారి ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవి వీరిలో కనిపించడం లేదు. అలాంటి కేసులు ఇప్పటివరకు నమోదు కాలేదని పేర్కొన్నారు.

Related News