logo

  BREAKING NEWS

వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |  

స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కు రెండోసారి కరోనా..!

భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ రెండో సారి కరోనా భారిన పడ్డారు. కొన్ని వారాల క్రితమే సైనా కరోనా నుంచి కోలుకున్నారు. గతేడాది డిసెంబర్ నెలలో సైనాతో పాటుగా ఆమె భర్త కశ్యప్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. డిసెంబర్ 27 న తాము కరోనా నుంచి కోలుకున్నట్టుగా ఆమె భర్త కశ్యప్ ప్రకటించారు.

తాజాగా మంగళవారం థాయిలాండ్ ఓపెన్ సూపర్ -1000 మొదలవుతున్న నేపథ్యంలో ఆమె భారత్ నుంచి బ్యాంకాక్ కు వెళ్లారు . టోర్నమెంట్ లో పాల్గొనబోయే క్రీడాకారులకు ముందస్తుగా కరోనా పరీక్షలు చేస్తారు. ఈ సందర్భంగా సైనా కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆమె థాయ్ లాండ్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ఆమెతో పాటుగా హెచ్ ఎస్ ప్రణయ్ కు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం వీరిద్దరిని ఆసుపత్రిలో క్వారెంటైన్ లో ఉంచారు.

కరోనా కారణంగా దాదాపు 10 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఈ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు సైనా నెహ్వాల్, పీవీ సింధు వంటి భారత షట్లర్లు ఎంతో శ్రమించారు. ఈ టోర్నమెంట్లో ఈ సారి జపాన్, చైనా ప్లేయర్లు పాల్గొనడం లేదు. దీంతో భారత్ కప్పు గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సైనా కరోనా బారిన పడటం ఆందోళనకరంగా మారింది.

Related News