ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి మధ్య మాటల యుద్ధం నడుస్తన్న విషయం తెలిసిందే. కరోనా పరిస్థితుల దృష్ట్యా న్నికల నిర్వహణ పై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా ఎన్నికల సంఘం మాత్రం ఏపీలో కరోనా అదుపులోనే ఉందని సెకండ్ వేవ్ వచ్చే అవకాశాలు లేవని చెప్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్‌పై వేటు వేశారు. 30 రోజుల పాటు విధులకు సెలవు పెట్టడమే కాకుండా ఇతర ఉద్యోగులను సైతం సెలవులపై వెళ్లేలా వారిని ప్రభావితం చేశారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ప్రభుత్వ సర్వీసుల్లో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ విధులు నిర్వహించడానికి వీలులేదని చెప్పింది. ఆర్టికల్ 243 రెడ్‌విత్, ఆర్టికల్ 324 ప్రకారం విధుల నుంచి సాయిప్రసాద్‌ని తొలగిస్తున్నట్లు ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.
నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే విధంగా ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్ ఉద్యోగులు ఎవరూ సెలవులు తీసుకోవద్దని సూచించినా జీవి సాయి ప్రసాద్ 30 రోజుల పాటు సెలవు పెట్టడమే కాకుండా ఇతర ఉద్యోగులను ప్రభావితం చేసారని ఆయనపై వేటు వేసింది. ఇదిలా ఉండగా ఈ నెల 23 తొలి దశ ఎన్నిలకు నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఈ నెల 27న రెండో దశ ఎన్నికలకు, ఈ నెల 31న మూడో దశ ఎన్నికలకు, ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 5న తొలి దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 9న రెండో దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 13 మూడో దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 17న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు.. రాష్ట్రంలో రేపటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది అని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం తెలిపింది.