logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

షాకింగ్ సర్వే: ఈ ఒక్క పని చేస్తే కరోనా తగ్గుతుందట..!

కరోనా వైరస్ పై వివిధ దేశాల్లో ఎన్నో రకాల పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. సార్స్ జాతికి చెందిన ఈ వైరస్ కాలక్రమేణా ఎన్నో విధాలుగా రూపాంతరం చెందుతూ తన లక్షణాలను మార్చుకుంటుండటం వల్ల ఈ వైరస్ ను కచ్చితంగా అంచనా వేయడం శాస్త్రవేత్తలకు కూడా సవాలుగా మారింది. అయితే కరోనా వైరస్ పై ఇప్పటికే ప్రజలకు ఓ అవగాహన కల్పించడంలో మాత్రం పరిశోధకులు ముందుకు సాగుతున్నారు.

తాజాగా జర్మన్ లోని రూర్ యూనివర్సిటీ పరిశోధకులు కరోనాపై మరో షాకింగ్ అప్ డేట్ ను వెల్లడించారు. కరోనా సోకిన రోగుల్లో గొంతులో అధిక మొత్తంలో వైరల్‌ లోడ్‌ కనిపిస్తోందని, ముక్కు చీదినప్పుడు, శ్వాస వదిలినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, దగ్గినప్పుడు వైరస్ బయటకు వస్తోందని పరిశోధకులు తెలిపారు. అయ్యితే ఈ వైరస్ ను బయటకు రాకుండా కట్టడి చేస్తే కొంతవరకు ఇతరులకు వైరస్ వ్యాప్తిని తగ్గనుంచవచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో మౌత్ వాష్ ను ఉపయోగించి నోటిని పుక్కిలించడం ద్వారా కరోనా రోగి నోటిలో వైరస్ అంతమవుతున్నట్టుగా గుర్తించారు. మూడు రకాల మౌత్ వాష్ లతో అయితే కరోనా పూర్తిగా తొలగిపోతున్నట్టుగా తెలిపారు. కాగా ఇలా చేయడం వల్ల నోట్లో ఈ మౌత్ వస్ ప్రభావం ఎంత సేపు ఉంటుంది. ఎంత సేపటి వరకు తిరిగి వైరస్ ను రాకుండా అడ్డుకోగలుగుతుంది అనే విషయం పై మరింత పరిశోధన అవసరం అని వివరించారు.

Related News