logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

డ్రాగన్ కంట్రీకి ఊరట.. కరోనా పుట్టింది చైనాలో కాదట.. ఎక్కడంటే?

ప్రపంచం మొత్తానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి పేరు చెబితే మనకు ముందుగా గుర్తొచ్చేది చైనానే. తొలి కరోనా కేసు నమోదైంది కూడా అక్కడే కావడంతో మరో దేశం నుంచి ఈ వైరస్ పుట్టుకొచ్చే అవకాశమే లేదనేది కొందరి ఆరోపణ. ఈ వైరస్ ను చైనా జీవాయుధంగా (బయోవెపన్) గా ప్రయోగించిందని ఆ దేశం కుటిల బుద్ది తెలిసిన చాలా మంది ఇప్పటికీ నమ్ముతారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ ను ఏకంగా చైనా వైరస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే.

వుహాన్ నగరంలోని ఓ పరిశోధనల ల్యాబ్ నుండి పమాదవశాత్తు ఈ వైరస్ లీక్ అవ్వడంతో చైనా ప్రయోగం బెడిసికొట్టింది అని అనుకునే వారు కూడా ఉన్నారు. కొన్ని పరిశోధనల అనంతరం గబ్బిలాల నుండి ఈ వైరస్ పుట్టుకొచ్చిందని తేల్చినా ఈ వైరస్ పుట్టుక ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. కారణం ఏదైనా ప్రాణాంతక వైరస్ సృష్టికి కారణమయ్యి లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుందని ప్రపంచ దేశాలన్నీ చైనాపై దుమ్మెత్తిపోస్తున్నాయి. చైనా కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఎన్నడూ లేని విధంగా విమర్శలు ఎదుర్కొంది. తాజాగా కరోనా పుట్టుకపై మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

మనమంతా అనుకుంటున్నట్టుగా కరోనా వైరస్ పుట్టింది చైనాలో కాదట. కరోనా వైరస్ మూలాలు చైనా కంటే ముందుగా స్పెయిన్ లో ఉన్నాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా స్పెయిన్ శాస్త్రవేత్తలే ప్రకటించారు. 2019లో చైనాలో తొలి కరోనా కేసు నమోదైన 41 రోజుల తర్వాత స్పెయిన్ లో మొదటి కేసు నమోదైంది. అప్పుడే ఆ దేశానికి చెందిన బార్సిలోనా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు ప్రారంభించారు.

2018 జనవరి నుంచి 2019 డిసెంబరు మధ్య స్పెయిన్‌లోని వివిధ నగరాల నుంచి మురుగునీటి నమూనాలను వేర్వేరు తేదీల్లో సేకరించి పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనల్లో మురుగు నీటిలో కరోనా వైరస్ జన్యువులను గుర్తించామని వెల్లడించారు. కరోనా వైరస్ శ్వాస కోశ సంబంధిత వ్యాధి అయినప్పటికీ వైరస్ సోకిన వ్యక్తుల మల మూత్రాలలో ఈ వైరస్ ను గుర్తించవచ్చన్నారు. దీని ఆధారంగా చైనా కంటే ముందుగానే స్పెయిన్ లో ఈ వైరస్ ఉనికిలో ఉందని వారు చెప్తున్నారు. అయితే దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో పరిశోధనలు జరపవలసి ఉందన్నారు. ఇప్పటికే తాము సేకరించిన నమూనాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందజేశామని వారి నుంచి స్పష్టత రావలసి ఉందని తెలిపారు.

Related News