logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

మళ్ళీ తెరుచుకోనున్న స్కూల్స్.. ఎప్పటి నుంచి అంటే?

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా విద్య సంస్థలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే త్వరలోనే పాఠశాలలను తిరిగి ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల విద్యా సంస్థలను మూసివేస్తూ ప్రకటన చేసిన ప్రభుత్వం 10వ తరగతి, ఇంటర్ మీడియట్ పరీక్షల పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు పరీక్షలు దగ్గర పడుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయాన్నీ విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో మరో కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో తెలంగాణలో ఏప్రిల్ మొదటి వారం నుంచి పాఠశాలలను తిరిగి ప్రారంభించనున్నట్టుగా తెలుస్తుంది. రెండు రోజుల క్రితం ఇంటర్ పరీక్షలపై క్లారిటీ ఇస్తూ.. మే 1వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఇంటర్ బోర్డు తెలిపింది.

అదే విధంగా పదవ తరగత పరీక్షలకు సంబందించిన షెడ్యూల్ విడుదల చేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం. మే 17 నుంచి 26 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆన్ లైన్ క్లాసుల వల్ల కొంత మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏయే తరగతుల వారికి క్లాసులు నిర్వహిస్తారనే విషయంపై స్పష్టత రావాలంటే ప్రభుత్వ ప్రకటన వచ్చేదాకా ఆగాల్సిందే.

Related News