logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు..!

కరోనా లాక్ డౌన్ కారణంగా గతంలో వాయిదా పడిన రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైంది. జూన్ 19న రాజ్య సభ ఎన్నికలు నిర్వహించేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం తేదీ ఖరారు చేసింది. మొత్తం 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ఉండగా అందులో ఏపీ లో 4 నాలుగు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా తెలంగాణలో ఇప్పటికే రెండు స్థానాలు ఏకగ్రీవం అయినా విషయం తెలిసిందే.

ఏపీలో అధికార వైసీపీ పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులు, టీడీపీ నుండి ఒకరు ఈ ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు. అదే విధంగా ఏపీతో పాటుగా గుజరాత్(4), మధ్యప్రదేశ్ (3), రాజస్థాన్(3), జార్ఖండ్(1), మణిపూర్(1), మేఘాలయ(1) రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేల 19న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

అయితే కరోనా కారణంగా నిబంధనలు పాటిస్తూ ఈ ప్రక్రియను పూర్తి చేయవలసిందిగా ఎన్నికల సంఘం పేర్కొంది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న మొత్తం 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించవలసింది ఉండగా అందులో అప్పటికే 37 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 18 స్థానాలకు మార్చి 26న పోలింగ్ జరగవలసి ఉండగా లాక్ డౌన్ కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టుగా గతంలో ఎన్నికల సంఘం ప్రకటించింది. .

Related News