క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండుల్కర్ ప్రేమలో పడిందా ? ఓ యువ క్రికెటర్‌తో డేటింగ్లో ఉందా ? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్న భావాలే వీరి మధ్య ప్రేమ చిగురించిందనే ప్రచారానికి కారణమవుతోంది. ఇప్పుడు ఐపీఎల్ క్రేజ్ నడుస్తున్న వేళ సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య వ్యవహారంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
ఐపీఎల్లో ఆడుతున్న యువ భారత క్రికెటర్లలో శుభమాన్ గిల్ ఒకరు. 21 ఏళ్ల శుభమాన్ మంచి ట్యాలెంటెడ్ ప్లేయర్. 2018 అండర్ 19 ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా కూడా శుభమాన్ నిలిచాడు. శుభమాన్ ట్యాలెంట్‌కు సీనియర్ల నుంచి కూడా అనేకసార్లు ప్రశంసలు అందాయి. ఈ యంగ్ ప్లేయర్‌తోనే ఇప్పుడు సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ ప్రేమలో ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇటీవల శుభమాన్ ఓ కొత్త రేంజ్ రోవర్ కారు కొన్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో కారుతో తాను దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌కు సారా ఇచ్చిన రియాక్షన్ వీరి ప్రేమాయణానికి సంబంధించిన ప్రచారానికి కారణమైంది. ఈ ఫోటోకు కంగ్రాట్యులేషన్స్ అని కామెంట్ చేయడంతో పాటు ఒక హార్ట్ ఎమోజీని పెట్టింది సారా టెండుల్కర్. దీంతో వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అని నెటిజన్లలో గాసిప్స్ మొదలయ్యాయి. ఇక ఈ కామెంట్‌కు మరో యంగ్ క్రికెటర్ హార్ధిక్ పాండ్యా స్పందించడంతో మరింత హాట్ చర్చ జరుగుతోంది.
హార్ధిక్‌కు అసలే నోటిలో మాట ఆగదు. సారా టెండుల్కర్ కామెంట్‌పై హార్ధిక్ స్పందిస్తూ.. మోస్ట్ వెల్కమ్ ఫ్రమ్ హర్ అని కామెంట్ చేశాడు. హార్ధిక్ కామెంట్‌తో శుభమాన్ – సారా మధ్య నిజంగా ప్రేమ వ్యవహారం ఉందని నెటిజన్స్ భావిస్తున్నారు. తాజాగా, ఇటువంటిదే మరోటి జరిగింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో శుభమాన్ గిల్ మంచి ఫీల్డింగ్ ప్రతిభను కనబరిచాడు.
ఇందుకు సంబంధించిన ఫోటోను సారా టెండుల్కర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంతేకాదు, ఇక్కడ కూడా మూడు హార్ట్ ఎమోజీలు పెట్టింది. దీంతో వీరి వ్యవహారం ఇప్పుడు వైరల్‌గా మారింది. వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందనే వార్తలు వస్తున్నాయి. నెటిజన్లలోనూ ఇదే చర్చ జరుగుతోంది. మరి, ఇది నిజమో కాదో కొన్ని రోజులు చూస్తే తెలుస్తుంది.