logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

అనాథాశ్రమంలో బాలిక అత్యాచార ఘటన.. హైపవర్ కమిటీ విచారణలో కొత్త కోణం

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లోని మారుతి అనాథాశ్రమంలో ఘోరాతిఘోరమైన ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తల్లిదండ్రులను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో అనాథాశ్రమానికి వచ్చిన అనాథ బాలికలకు విద్యా బుద్దులు నేర్పించి ప్రయోజకులను చేయాల్సిన వారు వక్రబుద్ధితో ఓ బాలిక మృతికి కారణమయ్యారు. డబ్బులకు కక్కుర్తి పడి ఆ మైనర్ బాలికను ఓ దుర్మార్గుడి చేతికి అప్పగించారు.

మత్తు మందిచ్చి కొన్ని నెలల పాటు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టడంతో తీవ్ర అనారోగ్యం పాలైన బాలిక చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతి చెందింది. కాగా ఈ ఘటనపై ప్రభుత్వ హై పవర్ కమిటీని నియమించింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. హై పవర్ కమిటీ విచారణలో ఇపుడు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మరణించిన బాలికతో పాటుగా వేణు గోపాల్ మరో బాలికపై కూడా ఇదే విధంగా లైంగీక దాడి జరిపాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాగా ఈ ఆశ్రమ నిర్వాహకులకు సంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ ఫేర్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యురాలి సహకారంతో ఈ దుర్మాగారాలు జరిగాయని సమాచారం. అంతే కాదు ఇటీవల లాక్ డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల నుంచి రెస్క్యూ చేసి తీసుకువచ్చిన మైనర్లను కూడా తమ ఆశ్రమానికి పంపాలని సీడబ్ల్యూసీ సిబ్బందిపై ఆశ్రమ నిర్వాహకులు ఒత్తిడి తీసుకువచ్చినట్టుగా విచారణలో తేలినట్టు సమాచారం. కాగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయం నుంచి బాలిక మరణించే వరకు ఆమెతోనే ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో వీరి పాత్ర కీలకంగా మారనుంది.

ఇప్పటికే ఈ ఘటనలో అనాథశ్రమం నిర్వాహకురాలు, ఆమె సోదరుడితో పాటుగా బాలికపై అత్యాచారం జరిపిన వేణుగోపాల్ రెడ్డి(50) పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసారు. ఈరోజు హై పవర్ కమిటీ వేణుగోపాల్ రెడ్డితో పాటుగా, సీడబ్ల్యూసీ ని కూడా విచారించనుంది. బాలిక చివరి క్షణం వరకు ఏం జరిగిందనే విషయాలను తెలుసుకోనున్నారు. ఈ ఘటనతో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అనాథాశ్రమాల్లో ఉన్న బాలికల సంరక్షణపై ఆందోళన వ్యక్తం అవుతుంది. రాష్ట్రలో ఉన్న 400 అనాథాశ్రమాల్లో 19 వేల మంది బాలికలు ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పుడు వీటన్నింటిపై తనికీలు నిర్వహించనున్నారు అధికారులు.

వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన 14 ఏళ్ల బాలిక చిన్ననాడే తల్లిని రెండేళ్ల క్రితం తండ్రిని కోల్పోయింది. దీంతో ఆమెను బంధువులు మారుతీ అనాథాశ్రమంలో చేర్పించారు. కాగా ఆశ్రమ నిర్వాహకురాలు ఆమెకు వరసకు సోదరుడైన మరో వ్యక్తి అక్రమాలకు పాల్పడ్డారు. ఆశ్రమానికి తరచుగా వారికి పరిచయస్థుడైన వేణుగోపాల్ రెడ్డి వస్తుండేవాడు. కొన్ని నెలల క్రితం అతని కన్ను బాలికపై పై పడింది.

అతని దగ్గర డబ్బులు తీసుకుని వేణుగోపాల్ రెడ్డి ఆశ్రమానికి వచ్చిన ప్రతి సారి బాలికను అతని గదిలోకి పంపించేవారు. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపిచ్చి నిందితుడు బాలికపై కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల బాలిక తీవ్ర అనారోగ్యానికి గురవ్వకంతో ఆమెను తిరిగి బంధువుల ఇంటికి పంపించేశారు. బాలిక కనీసం సొంత అవసరాలను కూడా తేర్చుకోలేకపోవడంతో బంధువులు కూడా ఆమెను ఛీత్కరించుకున్నారు.

బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కు ఈ విషయం తెలియడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే చికిత్స పొందుతూ బాలిక మృతి చెందడంతో ఈ ఘటన విషాదంగా మారింది. ఈ కేసుపై ఇప్పుడు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ ఆశ్రమంలో ఇంకా ఎంత మందిపై ఇలాంటి అఘాయిత్యాలు జరిగాయనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటుగా ఇలాంటి ఆశ్రమాలన్నిటిపై తనికీలు నిర్వహించనున్నారు.

Related News