logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ప్ర‌కృతి ప‌గ‌బ‌ట్టిందా..? ఢిల్లీలో ఇసుక తుఫాను

ఒక‌వైపు క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభిస్తుంటే ప్ర‌కృతి కూడా ప‌గ‌బ‌ట్టిన‌ట్లుగా ప‌రిస్థితి ఉంది. న‌డి ఎండాకాలంలో భారీగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ దేశ రాజ‌ధాని ఢిల్లీలో భారీగా ఇసుక తుఫాను చెల‌రేగింది. దుమ్మూ, ధూళి ఢిల్లీని క‌ప్పేసింది. మ‌ధ్యాహ్నమే న‌గ‌ర‌మంతా చీక‌టిగా మారిపోయింది. దీంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. న‌గ‌ర‌మంతా పూర్తిగా దుమ్ముతో నిండిపోయింది.

కాగా, తెలంగాణ‌, హ‌ర్యానా, చండీఘ‌డ్‌, ఉత్త‌రాఖండ్‌లోనూ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేస్తోంది. జ‌మ్మూ క‌శ్మీర్‌, ల‌డ్ఢాక్‌, గిల్గిట్ – బ‌ల్టిస్థాన్‌, ముజ‌ఫ‌రాబాద్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, పంజాబ్‌, మ‌ధ్య ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌లోనూ ఇసుక తుఫాన్ చెల‌రేగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ చెబుతోంది. ఇప్ప‌టికే అకాల వ‌ర్షాల కార‌ణంగా చేతికందిన పంట‌ను రైతులు న‌ష్ట‌పోతున్న విష‌యం తెలిసిందే.

Related News