logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

నేను సంచయిత గజపతిని.. చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటర్..!

కేరళ అనంత పద్మనాభుని కేసులో ఆలయ నిర్వహణ బాధ్యతను ట్రావెన్స్ కొర్ రాజవంశీకులకు అప్పగిస్తూ సుప్రీం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం మాన్సాస్ ట్రస్టు, సింహాచలం దేవస్థానం విషయంలో గజపతి కుటుంబీకులను ఆలయ సంరక్షకులుగా ఉంచాలని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేసారు.

ఈ ట్వీట్ పై మాన్సాస్ ట్రస్టు చైర్మెన్ సంచయిత గజపతిరాజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘చంద్రబాబు గారూ.. నేను సంచాయితా గజపతి.. నా తండ్రి ఆనందగజపతి రాజుకు అన్ని విధాలా న్యాయపరమైన వారసురాలిని. అదే విధంగా మా తాతగారు మహారాజ పీవీజీ రాజు గారికి నా తండ్రి ఆనంద గజపతిరాజు అన్ని విధాలా న్యాయపరమైన వారసులు. నన్ను ట్రస్టు చైర్ పర్సన్ గా నియమించడం వల్ల సింహాచలం ఆలయం, మాన్సాస్ ట్రస్టు పై గజపతిరాజుల కుటుంబం హక్కులు పూర్తిగా సంరక్షించబడుతున్నాయి.

ఇక కుటుంబం మొత్తానికి నేనే వారసుడినంటూ చెప్పుకుంటున్న అశోక గజపతిరాజు లాగా కాకుండా మీరైనా లింగ సమానత్వానికి గౌరవం ఇస్తారని ఆశిస్తున్నాను. నేను గజపతి కుటుంబానికి చెందిన వ్యక్తిని కాదంటూ ఆయన మిమ్మల్ని పూర్తిగా తప్పుదోవ పట్టించారు. ఇక మీరు మా కుటంబ విషయాలను రాకీయం చేయకపోతే నేను మిమ్మల్ని తప్పకుండా అభినందిస్తాను అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Related News