logo

  BREAKING NEWS

అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |   వ్యాయామం ఏ వయసు వారు ఎంతసేవు చేయాలి: డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలు  |   బ్రేకింగ్: మంత్రి పేర్ని నానిపై హ‌త్యాయ‌త్నం  |   తెలంగాణలో కరోనా అప్ డేట్.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?  |   ‘సర్జికల్ స్ట్రయిక్స్’ అంటే ఏమిటి? ఎలాంటి సందర్భాలలో నిర్వహిస్తారు?  |   బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |  

బిగ్ బాస్ కంటెస్టెంట్ రెండో పెళ్లి.. ఫోటోలు వైరల్

బిగ్ బాస్ -2 కంటెస్టెంట్, తెలుగు సినీ నటుడు సామ్రాట్ రెడ్డి పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంజనా శ్రీ లిఖిత అనే యువతిని కరోనా నిబంధనలు పాటిస్తూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. కాగా సామ్రాట్ కు ఇది రెండో పెళ్లి అనే విషయం తెలిసిందే.

గతంలో హర్షిత రెడ్డి అనే యువతిని వివాహం చేసుకోగా ఆమె తనను కట్నం కోసం సామ్రాట్ అతని తల్లిదండ్రులు వేధిస్తున్నారంటూ కోర్టుకెక్కింది. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. తాజాగా సామ్రాట్ మరో వివాహం చేసుకుని ఓ ఇంటువాడయ్యాడు. అతనికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు నెటిజన్లు.

పలు సినిమాల్లో నటించిన సామ్రాట్ కు బిగ్ బాస్ రియాలిటీ షోతోనే గుర్తింపు వచ్చింది. వివాదాలు లేని వ్యక్థగా మంచి పేరు సంపాదించుకున్న సామ్రాట్ టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచాడు. అతని సోదరి ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ శిల్పా రెడ్డి వివాహ వేడుకకు సంబందించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసారు.

Related News