logo

  BREAKING NEWS

ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |   అప్ప‌టినుంచే రామ్‌తో ప‌రిచ‌యం.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పిన సునీత  |   ఏపీ గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం జరుగుతోంది?  |   బ్రేకింగ్: హైదరాబాద్ కు కరోనా వాక్సిన్!  |   బ్రేకింగ్ : ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ!  |  

ఒకే బ్లడ్ గ్రూపు ఉన్న అమ్మాయి-అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చా?

ఈ మధ్య కాలంలో పెళ్లిచేసుకోబోయే యువత వైద్యుల దగ్గర అధికంగా ప్రస్తావిస్తున్న సందేహం ఒకటుంది. మేనరికపు సంబంధాలు, రక్త సంబంధీకులను పెళ్లి చేసుకుంటే వారికి పుట్టబోయే పిల్లల్లో జన్యు సంబంధమైన లోపాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్న అమ్మాయి- అబ్బాయి పెళ్లి చేసుకుంటే కూడా పిల్లలు అంగవైకల్యంతో పుడతారని కొందరు భావిస్తుంటారు. ఇందులో నిజమెంత? నిజంగానే ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్న ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుంటే ఆ సమస్యలు తలెత్తుతాయా? వైద్యులు ఏమంటున్నారు అంటే..

ఒకే బ్లడ్ గ్రూపు ఉన్న తల్లిదండ్రులను వైద్యులు సురక్షితమైన తల్లిదండ్రులుగానే చెప్తారు. పెళ్లిచేసుకోబోయే వారి బ్లడ్ గ్రూపులు ఒకటే అయినా లేక వేరు రుగా ఉన్నా వారికి భవిష్యత్తులో ఎలాంటి సమస్య తలెత్తదు. ఈ విషయంలో ఎంతో మందికి కొన్ని అపోహలు ఉన్నాయి. కానీ ఒకే బ్లడ్ గ్రూప్ వారిని వివాహం చేసుకోవడం వలన తల్లిదండ్రుల్లో గాని పిల్లల్లో గాని ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని వైద్యులు సూచిస్తున్నారు.

ఒకవేళ భార్యకు ఓ పాజిటివ్ ఉండి భర్తకు కూడా ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటె ఇద్దరికీ కలిసి ఆర్ హెచ్ ప్లస్ అర్థమట. ఇది సరైన మ్యాచ్ గానే భావిస్తున్నారు. ఈ తలిదండ్రుల్లో కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని వైద్యులు చెప్తున్నారు. సాధారణంగా తల్లిదండ్రులిద్దరిదీ ఒకే బ్లడ్ గ్రూప్ అయితే పుట్టబోయే పిల్లలకు కూడా అదే గ్రూపు ఉంటుంది.

ఒకవేళ తల్లిదండ్రులది వేరు వేరు బ్లడ్ గ్రూపులైతే వారిలో ఎవరో ఒకరి బ్లడ్ గ్రూప్ పిల్లలకు వారసత్వంగా వస్తుంది. ఎక్కువ శాతం తండ్రి రక్తమే పిల్లలకు సంక్రమిస్తుంది. అయితే తల్లి బ్లడ్ గ్రూపు వారసత్వంగా వచ్చిన పిల్లల కంటే తండ్రి బ్లడ్ గ్రూపుతో జన్మించిన పిల్లలు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.

అలాగే మేనరికపు వివాహాలు చేసుకున్న వారిలో కూడా అందరికీ ఈ సమస్యలు వచ్చే అవకాశం లేదు. ఈ సమస్యలు ఎదుర్కునే వారి సంఖ్య 2 నుంచి 3 శాతంగా అంటుంది. రక్త సంబంధీకులలోని జన్యువులలో ఏదైనా సమస్య ఉంటే, అవి భార్యాభర్తలలో ఇద్దరికీ ఉన్నప్పుడు… పుట్టేబిడ్డకు అవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.

Related News