logo

  BREAKING NEWS

తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |   జ‌గ‌న్‌ను ఓడించే కుట్ర‌..? కొడాలి నాని పాత్ర‌..?  |   బ్రేకింగ్‌: జ‌గ‌న్ ఇంటి ముట్ట‌డి.. హైద‌రాబాద్‌, తిరుప‌తిలో ఉద్రిక్త‌త‌‌  |   బ్రేకింగ్: డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త పేరు  |   అమెరికా నుంచి ఎలా వ‌చ్చింది..? ‘కాంగ్రెస్ గ‌డ్డి’ అని ఎందుకు పిలుస్తారు ?  |   తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్య‌క్షుడి పేరు ఖ‌రారు  |   ఇక నుంచి ‘యాదాద్రి’ రైల్వే స్టేష‌న్‌  |   హ‌రీష్ రావు వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్‌రావు  |   ఈ చిన్న ప‌ని చేస్తే 15 నిమిషాల్లో త‌ల‌నొప్పి మాయం  |   రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే  |  

క్ష‌మించండి.. ర‌కుల్‌, సారా అలీ ఖాన్‌కు స‌మంత సారీ

డ్ర‌గ్స్ వినియోగదారులుగా ప్ర‌చారం జ‌రిగిన హీరోయిన్లు ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సారా అలీ ఖాన్‌ల‌కు మ‌రో హీరోయిన్ స‌మంత సారీ చెప్పారు. నిజానికి స‌మంత త‌ప్పు ఏమీ లేక‌పోయినా నెటిజ‌న్లు, ప్ర‌జ‌ల త‌ర‌పున ఆమె వారిద్ద‌రికీ సారీ చెప్పారు. ఏం జ‌రిగిందంటే.. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్ప‌ద మృతి కేసులో ఆయ‌న ప్రేయ‌సి రియా చ‌క్ర‌వ‌ర్తిని పోలీసులు విచారించారు. ఈ క్ర‌మంలో డ్ర‌గ్స్ ముఠాతో ఆమెకు సంబంధాలు వెలుగులోకి వ‌చ్చారు.

దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆమెపై కేసు న‌మోదు చేసి విచారిస్తోంది. ఈ క్ర‌మంలో రియా చ‌క్ర‌వ‌ర్తి బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ వినియోగిస్తున్న 25 మంది ప్ర‌ముఖ‌ల పేర్లు బ‌య‌ట‌పెట్టార‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఇందులో టాలీవుడ్ టాప్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌, బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ పేర్లు కూడా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. మెయిన్‌స్ట్రీమ్ మీడియాలోనూ ఈ వార్త‌లు రావ‌డంతో నెటిజ‌న్లు నిజ‌మే అని న‌మ్మారు.

ర‌కుల్‌, సారాకు వ్య‌తిరేకంగా నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేశారు. అయితే, బాలీవుడ్ ప్ర‌ముఖుల జాబితాను తామేమీ సిద్ధం చేయ‌లేద‌ని, అవ‌న్ని త‌ప్పుడు ప్ర‌చారాలేన‌ని ఎన్‌సీబీ అధికారులు వెల్ల‌డించారు. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సారా అలీ ఖాన్ పేర్లు కూడా లేవ‌ని, డ్ర‌గ్స్ ముఠా పేర్ల‌నే సేక‌రించామ‌ని తెలిపారు. దీంతో ఇన్నిరోజులుగా ర‌కుల్‌, సారాపై జ‌రుగుతున్న‌ది త‌ప్పుడు ప్ర‌చార‌మే అని తేలింది.

దీంతో నెటిజ‌న్లు ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సారా అలీ ఖాన్‌కు సోష‌ల్ మీడియాలో క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నారు. హీరోయిన్ స‌మంత కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా వీరికి సారీ చెప్పారు. వీరికి వ్య‌తిరేకంగా జ‌రిగిన ప్ర‌చారం కార‌ణంగా స‌మంత కూడా నెటిజ‌న్ల త‌ర‌పున ఈ సారీ చెప్పిన‌ట్లున్నారు.

Related News