logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

సమంత డిగ్రీ సెర్టిఫికెట్ ను లీక్ చేసిన అభిమాని

‘ఏం మాయ చేసావే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత ఆ తరువాత అక్కినేని వారసుడు నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకుని సెటిల్ అయ్యింది. ప్రస్తుతం టాలీవూడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత ఒకప్పుడు చదువులో కూడా తాను టాపర్ అని కొని సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఇటీవల ఆమె తన పదవ తరగతి సెర్టిఫికెట్లను కూడా అభిమానులతో పంచుకుంది.

తాజాగా సమంత డిగ్రీ సెర్టిఫికెట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ సెర్టిఫికెట్ ను సమంత అభిమాని ఒకరు పోస్ట్ చేయగా ఇది చూసిన అభిమానులతో పాటు సమంత కూడా షాకైంది. ‘ఈ సెర్టిఫికెట్ నీ దగ్గరకు ఎలా వచ్చింది?’ అని సమంత ఆ అభిమానిని ప్రశ్నించగా అతని నుండి ఎలాంటి సమాధానం రాలేదు. ఆ తరువాత ఆట్వీట్ ను డిలేట్ చేసాడు.

ప్రస్తుతం ఈ సెర్టిఫికెట్ చూసిన ఆమె అభిమానులు మాత్రం మీరు నిజంగానే టాలెంటెడ్ విమెన్ అంటూ ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో నుండి వచ్చిన సమంత మొదటి నుండి చదువులో ముందుండేది. బీకామ్ ఫస్ట్ క్లాస్ లో పూర్తిచేసింది. ఆ ఆతరువాత అనుకోకుండా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టి సినిమాలను వృత్తిగా మార్చుకుంది.

Related News