logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

భర్త ఫోటోపై సమంత కామెంట్.. నెట్టింలో వైరల్!

టాలీవుడ్‌లో మోస్ట్ ఫేమస్ కపుల్స్‌లో అక్కినేని నాగ చైతన్య.. సమంత జంట ఒకటి. దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన ‘ఏమాయ చేశావే’ సినిమా సమయంలో ప్రేమలో పడిన ఈ ఇద్దరూ.. అప్పటి నుంచి తమ బంధాన్ని కొనసాగించారు. కొన్నేళ్ల క్రితం ఈ జంట అగ్నిసాక్షిగా ఒక్కటైంది. వివాహం తర్వాత కూడా వీళ్లిద్దరి కెరీర్‌లో ఏమాత్రం మార్పు లేకుండా ముందుకెళ్తున్నారు.

తాజాగా నాగ చైతన్య ఫోటోకి సమంత చేసిన ఓ చిలిపి కామెంట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. నాగ చైతన్య తాజాగా విక్రమ్ కుమార్ దర్శకత్వం లో ‘థాంక్యూ’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమాలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ కూడా భాగమయ్యారు.

విక్రమ్ గత సినిమాలన్నిటికీ పిసి శ్రీరామ్ పనిచేసిన విషయం తెలిసిందే. అందుకే వీరి అంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ మనసుకు హత్తుకునే దృశ్యాలతో ఉంటాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఏదో ఒక మూల కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్న చై ను పీసీ శ్రీరామ్ తన కెమెరాలో బంధించారు.

ఈ పిక్ ను చై షేర్ చేస్తూ ఆయనలాంటి వ్యక్తితో పని చేయడం గర్వంగా అందంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు. అయితే ఈ పిక్ పై సమంత కూడా స్పందించింది. కానీ ఆమె తనదైన స్టైల్ లో ఓ చిలిపి కామెంట్ ను జోడించింది. ”అరే.. నా గురించే ఆలోచిస్తున్నావా?” అంటూ సామ్ చేసిన కామెంట్ వైరల్ గా మారింది.

Related News