logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

కరోనా వ్యాప్తి నివారణ: అతిపెద్ద సమస్యకు చెక్ పెట్టిన పరిశోధకులు..!

ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో పోరాటం చేస్తుంది. ఈ వైరస్ ను ఓడించాలంటే ముందుగా ఈ వైరస్ ఎంత మందికి సోకిందనే విషయం తెలియాలి. అపుడే ఈ వైరస్ ఇంకా ఎంతమందికి ఏయే మార్గాల ద్వారా సోకుతుందో ఒక అంచనా వేయగలం. కరోనా పరీక్షల ద్వారానే వైరస్ నియంత్రణ సాధ్యమవుతుంది. ఇంత కీలకంగా ఉన్న కరోనా పరీక్షలను అధిక సంఖ్యలో చేయించడంలేదనేది దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఎదుర్కుంటున్న ప్రధాన ఆరోపణ. భారత్ లో ప్రస్తుతం ఆర్టీ- పీసీఆర్, ట్రూనాట్, సీబీనాట్ విధానాలు ఉపయోగించి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

అయితే వీటిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. గొంతు, ముక్కు ద్వారా స్వాబ్ ను సేకరించవలసి ఉంటుంది. అందుకోసం సిబ్బందికి శిక్షణ ఇప్పించాలి. సేకరించిన నమూనాలను అత్యంత జాగ్రత్తగా భద్రపరచవలసి ఉంటుంది. పరీక్ష ఫలితాల కోసం సమయం పట్టవచ్చు. వీటి నిర్వహణా ఖర్చు కూడా ప్రభుత్వాలకు ఒక సమస్యే. ఇన్ని సవాళ్లతో కూడుకొవడం వల్లనే కోవిడ్ పరీక్షలు కొని రాష్ట్రాల్లో ఆలస్యమవుతున్నాయి. దీంతో సరైన సమయంలో అనుమానితులను ఐసోలేషన్ కు పంపించడడంలో విఫలమవుతున్నారు. ఈలోపే మరికొంత మంది ఈ వైరస్ భారిన పడుతున్నారు. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కరోనా కేసులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

ఈ సమస్యలను అధిగమించడం కోసం ప్రపంచం మొత్తం పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షల్లో ‘సలైవ డైరెక్ట్’ అనే కొత్త విధానానికి అమెరికా ఎఫ్ డిఏ ఆమోదం లభించింది. కోవిడ్ టెస్టుల్లో ఇదో గేమ్ చేంజర్ గా మారబోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పద్దతిలో వ్యక్తుల లాలాజలం ద్వారా కరోనా నిర్ధారణ చేస్తారు. ఇలా సేకరించిన శాంపిల్ తో కచ్చితమైన ఫలితాలను పొందడమే కాకా ఇప్పుడు అవలంభిస్తున్న అన్ని పద్ధతులకన్నా అత్యంత వేగంగా ఫలితాలను రాబట్టవచ్చు.

యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిపుణులు అభివృద్ధి చేసిన ఈ విధానం ద్వారా శ్వాబ్ పరీక్షలతో సమానంగా ఫలితాలు వస్తున్నాయని.. 90 శాతం కరోనాను నిర్ధారించవచ్చని ఎఫ్ డీఏ పేర్కొంది. మరో రెండు వారాల్లో దేశవ్యాప్తంగా సలైవ డైరెక్ట్ విధానాన్ని తీసుకువస్తామని తెలిపారు. దీంతో కోవిడ్ నిర్ధారణ పరీక్షల సామర్థ్యం భారీగా పెరగడంతో పాటు పరీక్షల ఖర్చు కూడా తగ్గనుందని అంటున్నారు. ముక్కు, గొంతు నుంచి స్వాబ్ ను సేకరించే సమయంలో తుమ్ముల కారణంగా ఎదుటివారికి వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తుంది.

సలైవా ఆధారంగా పరీక్షలు జరిపితే పరీక్షలు జరిపే వారికి ఈ విధమైన రిస్కు తక్కువగా ఉంటుంది. ఈ పద్దతిలో పరీక్ష జరిపించుకోదలచిన వ్యక్తులే తమ లాలాజలాన్ని సేకరించి ఇస్తారు. ఇతర పద్దతిలో లాగా ముక్కు, గొంతు భాగాల్లో గాయాలు అవ్వడం లాంటి హాని ఉండదు. కనిష్ట ఉష్ణోగ్రతల వద్ద ఈ నమూనాలను భద్రపరచాల్సిన అవసరం ఉండదు. వీలైనంత ఎక్కువ మందికి పరీక్షలు జరిపే అవకాశం ఉండటంతో అంతర్జాతీయంగా కూడా ఈ విధానాన్ని స్వాగతిస్తున్నారు. ప్రస్తుతం బ్రిటన్ అభివృద్ధి పరిచిన స్వాబ్ పద్ధతిలో భారత్ టెస్టులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సలైవ డైరెక్ విధానాన్ని కూడా త్వరలోనే అందిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి.

Related News