logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ధోని రిటైర్మెంట్ నిర్ణయం వెనుక మనోవేదన: భార్య సాక్షి సింగ్

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వార్త ఎంతో మంది క్రికెట్ అభిమానులను కలచివేస్తుంది. ఈ నేపథ్యంలో పలువురు ఆటగాళ్లు, సినీ ప్రముఖులు ధోనితో తమకున్న అనుబంధం గురించి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. తమ జ్ఞాపకాలను మరోసారి నెమరు వేసుకుంటున్నారు.

ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తుంది. ధోనికి సంబందించిన ఫోటోలు, వీడియోలతో సోషల్ మెయిల్ నిండిపోయింది. ధోని రిటైర్మెంట్ ప్రస్తుతం ట్విట్టర్ ట్రేండింగ్ లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ధోని సతీమణి సాక్షి సింగ్ కూడా భర్త రిటైర్మెంట్ పై భావోద్వేగ పోస్ట్ చేసారు. ధోని సేవలను క్రికెట్ ప్రపంచం ఎన్నటికీ మర్చిపోదని.. రిటైర్మెంట్ ప్రకటించే ముందు ధోని అనుభవించిన మనోవేదన తెలుసునని పేర్కొన్నారు.

‘జీవితకాలంలో దేశం గర్వించదగ్గ ఎన్నో విజయాలను అందించారు. మిమ్మల్ని చూసి నేను గర్విస్తున్నాను. రిటైర్మెంట్‌ ప్రకటించినందుకు అభినందనలు. మీకెంతో ఇష్టమైన క్రికెట్ కు వీడ్కోలు పలికే సమయంలో మీరు పడిన మనోవేదన నాకు తెలుసు. కన్నీళ్లను దిగమింగుకొని రిటైర్మెంట్‌ ప్రకటించారని అనుకుంటున్నాను. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పిన మాటలు, చేసిన పనిని ప్రజలు మర్చిపోతారేమో కానీ, వాళ్లకు అందించిన అనుభూతిని ఎప్పుడూ మర్చిపోలేరు’ అంటూ సాక్షి ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ అయ్యారు.

Related News