logo

  BREAKING NEWS

మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌లు.. 07.03.2021 బంగారం ధ‌ర  |   ఫలించిన ‘శ్వేత రాయబారం’.. మనసు మార్చుకున్న బుద్ధా!  |   హిందూపురంలో సీన్ రిపీట్.. అభిమానికి విశ్వరూపం చూపించిన బాలయ్య!  |   నా అనుచరుడు ఒక్కడు చాలు.. నీ పని ఖతం: టీడీపీలో బుద్ధా వర్సెస్ కేశినేని  |   అవును అప్పులు చేసాం.. ఆ విషయం గర్వంగా చెప్తాం : మంత్రి బుగ్గన  |   షాకింగ్ సర్వే.. హైదరాబాద్ లో ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా!  |   అసెంబ్లీ ఎన్నికల ముందు కేరళ సీఎంకు షాక్.. విజయన్ మెడకు మళ్ళీ అదే కేసు!  |   హై కోర్టుకు ఎన్నికల సంఘం క్షమాపణలు.. ఎందుకంటే?  |   ఇదేనా దోస్తానా..? ఏపీలో అడుగుపెడుతున్న ఎంఐఎం  |   మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |  

జగన్ వద్దన్నారు.. షర్మిల వైసీపీ లైన్ దాటారు: సజ్జల హాట్ కామెంట్స్!

తెలంగాణలో షర్మిల పార్టీపై వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిలమ్మ పార్టీ గురించి తెలియదని బుకాయించే ప్రయత్నం చేయనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి తెలంగాణలో పార్టీపై చర్చ జరుగుతుందన్నారు. అయితే జగన్ ప్రభుత్వం పక్క రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని ఏనాడు అనుకోలేదని ఇకపై కూడా అలాంటి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు.

పార్టీలో షర్మిలను ఎదగనివ్వకపోవడం అనేది లేదు. ఆమె పార్టీకి పూర్తిగా సహకరించారు కాబట్టే జగన్ కోసం 3 వెల్ కిలో మీటర్లు పాదయాత్ర చేసారు. ఇది కేవలం ఆమె వ్యక్తిగత నిర్ణయం మాత్రమేనన్నారు. అయితే వైఎస్ జగన్ సోదరి షర్మిలమ్మ మాత్రం ఏపీలో జరుగుతన్న అభివృద్ధి తెలంగాణలో కూడా జరగాలని కోరుకున్నారు.

అందుకే గత మూడు నెలలుగా తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటుపై ఆలోచనలో ఉన్నారన్నారు. అయితే ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారన్నారు. తెలంగాణలో రాజకీయాలు చేస్తే సొంత రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని జగన్ అభిప్రాయపడ్డారని అన్నారు.

అందులో భాగంగా తెలంగాణలో పార్టీ పెడితే తలెత్తే ఇబ్బందుల గురించి ఆమెకు వివరించామన్నారు. కానీ షర్మిల వైసీపీ లైన్ ధాటి తాను ఓ ప్రయత్నం చేసి చూడాలని భావించారు. అంతే కానీ జగన్ ఆయన సోదరి మధ్య ఎలాంటి విబేధాలు లేవన్నారు. కేవలం భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయన్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయాక రెండు రాష్ట్రాలు కలిసి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది.

అందువల్ల తెలంగాణలో పార్టీ పెడితే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని జగన్ భావించారన్నారు. కాగా షర్మిల పార్టీతో వైసీపీ సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. షర్మిలను జగన్ సోదరిగా, ప్రియతమా నేత దివంగత వైఎస్సార్ బిడ్డగా ప్రజలు ఆశీర్వదించాలన్నారు. ఆమెకు ఏ సందర్భముగా బెస్ట్ విషెష్ ను తెలియజేసారు.

Related News