logo

  BREAKING NEWS

కరోనా వ్యాప్తి: కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం!  |   హైదరాబాద్ పరిధిలో ఈ పది డివిజన్లే ‘కరోనా’ డేంజర్ జోన్లు!  |   బ్రేకింగ్: సచివాలయం కూల్చివేత పై ప్రభుత్వానికి హైకోర్టు షాక్!  |   బ్రేకింగ్: కంటైన్మెంట్ జోన్ గా తిరుమల  |   గాంధీ కుటంబానికి ఊహించని షాకిచ్చిన కేంద్రం..!  |   ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు  |  

దేశానికి సైబర్ ముప్పు పొంచి ఉందన్న కేంద్రం.. నేటి నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక!

నేటి నుంచి భారత్ కు అతి పెద్ద సైబర్ ముప్పు పొంచి ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ సేవల పేరుతో సైబర్ నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజల నుంచి వ్యక్తిగత, ఆర్థిక వివరాలను దొంగిలించే ప్రమాదం ఉందని పేర్కొంది.

కరోనాకు సంబందించిన సమాచారాన్ని చూపుతూ దేశంలోని అతి పెద్ద సైబర్ ముఠా భారతీయుల సమాచారాన్ని చోరీ చేసేందుకు ప్రయత్నిస్తుందని, ncov2019@gov.in మెయిల్ ఐడీ వినియోగించి నకిలీ మెయిల్స్ పంపిస్తుందని తెలిపారు. ఇలాంటి మెయిల్ ఐడీతో వచ్చిన ఈమెయిల్ ను క్లిక్ చేయవద్దని హెచ్చరించింది.

లాక్ డౌన్ కారణంగా నష్టపోయిన ప్రజలకు ప్రభత్వం తరపున ఆర్థిక సహాయం అందించే పేరుతో ప్రజలను మభ్యపెట్టి సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఉచిత కరోనా పరీక్షలు నిర్వహిస్తామంటూ హైదరాబాద్ తో సహా దేశంలోని ప్రధాన పట్టణాలను టార్గెట్ చేసి సైబర్ నేరగాళ్లు భారీ ప్రణాళికలను రూపొందించారని తెలిపారు. ప్రజలు హ్యాకర్ల భారిన పడకుండా ఉండేందుకు ఆంటీవైరల్ టూల్స్ సేవలను ఉపయోగించాలని కేంద్రం తెలిపింది.

Related News