logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

టీవీ యాంకర్ పై మండిపడ్డ సాయి పల్లవి..!

‘ప్రేమమ్’ సినిమాతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన నటి సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ లో కూడా భారీ పాపులారిటీ సంపాదించుకుంది ఈ న్యాచురల్ బ్యూటీ. ఇప్పుడు తెలుగుతో పాటుగా తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. మలయాళం సినిమాతో హీరొయిన్ గా పరిచయమైన సాయి పల్లవిని చాలా మంది మలయాళీ అమ్మాయినే అనుకుంటారు.

చాలా సందర్భాల్లో ఆమెను కేరళ కుట్టిగానే పిలుస్తారు. కానీ తాను తమిళనాడు రాష్ట్రంలోని ఓ గిరిజన తెగకు చెందిన అమ్మయినని చెప్పి షాకిచ్చింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఈ తెగకు చెందిన వారిలో ఇంతటి స్థాయి గుర్తింపు తెచ్చుకున్న మొదటి యువతి కూడా సాయి పల్లవే కావడం విశేషం. ఇంత చెప్పినా ఆమెను మళ్ళీ అదే పేరుతో పిలుస్తుండటంతో సాయి పల్లవి కొంచెం అసహనానికి గురయ్యిందని సమాచారం.

ఇటేవలం ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో యాంకర్ ఆమెని మలయాళీ అని పిలిచేసరికి సాయి పల్లవి యాంకర్ పై ఫైర్ అయ్యిందట. నాకు అలా పిలిపించుకోవడం ఇష్టం లేదు. నేను తమిళనాడుకు చెందిన అమ్మాయిని. కోయంబత్తూరులో చదువుకున్నని, అక్కడే పెరిగానని తెలిపింది. ఇంకెప్పుడు అలా పిలవద్దని కొంచెం సీరియస్ గానే చెప్పిందట.

Related News