logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

‘మరో బిడ్డను తీసుకొచ్చే అర్హత లేదు’.. సాయి పల్లవి ఫైర్

తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసి పాశవికంగా హత్య చేసిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతుంది. పుదుకొట్టాయ్ జిల్లా ఎంబాల్ గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారి జయప్రియ ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమైంది. చిన్నారి కోసం ఊరంతా వెతికిన తల్లదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

చివరకు ఊరి చివర మూళ్ళ పొదల్లో ఒళ్ళంతా గాయాలతో విగత జీవిగా పది ఉన్న చిన్నారి మృతదేహం లభించింది. పోస్టుమార్టం నివేదికలో చిన్నారిపై అత్యాచారం జరిపి హత్య చేసినట్టు తెలిసినది. ఈ ఘటనపై తమిళనాడు వ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖులతో పాటుగా నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. తాజాగా నటి సాయి పల్లవి ఈ ఘటనపై నిప్పులు చెరిగారు.

‘బలహీనులకు సహాయపడటానికి ఇచ్చిన శక్తిని మేము దుర్వినియోగం చేస్తున్నాము. ఎక్కడ బలహీనులు కనిపితే అక్కడ వారిపై అధికారాన్ని చూపుతున్నాము. ఈ ఘటనలతో మానవ జాతిపై ఆశ అత్యంత వేగంగా దిగజారుతోంది. గడుస్తున్న ప్రతి రోజు మానవజాతి తుడిచిపెట్టుకుపోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తుంది. ఇంత దారుణమైన ఘటనలు చూస్తున్న ఈ పనికిరాని జీవితం వ్యర్థం. చిన్నారులను సైతం కాపాడుకోలేకపోతున్న ఈరోజుల్లో మరో చిన్నారిని ఈ రాక్షస సమాజంలోకి తీసుకొచ్చే అర్హత మనకి లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన నాడు మాత్రమే న్యాయం జరిగే రోజులు రావద్దని, ఇంకా మన దృష్టికి రాని , మనం పట్టించుకోని నేరాలను ఏం చేయాలని సాయి పల్లవి ప్రశ్నించారు.

Related News